దర్శకుడు మారుతికి ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చిన మెగాస్టార్‌.. స్టేజ్‌పైనే హామీ..

By Aithagoni RajuFirst Published Jun 26, 2022, 10:49 PM IST
Highlights

దర్శకుడు మారుతికి సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు చిరంజీవి. పక్కా కమర్షియల్‌ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయనకు హామీ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ఇప్పటికే నాలుగు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. అందులో మూడు సినిమాలు చిత్రీకరణలో ఉండగా, మరో సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. తాజాగా మరో సినిమాని ప్రకటించారు. ఎంటర్‌టైన్‌మెంట్ కి కేరాఫ్‌గా నిలిచే మారుతి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు వెల్లడించారు. `పక్కా కమర్షియల్‌`(Pakka Commercial Event) చిత్ర ప్రీ రిలీజ్‌ వేదికగా ఈ కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించారు చిరంజీవి. 

గోపీచంద్‌ హీరోగా, రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్న చిత్రం `పక్కా కమర్షియల్‌`. మారుతి(Maruthi) దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈచిత్రం జులై 1న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో జరిగింది. చిరంజీవి అతిథిగా విచ్చేశారు. దీంతో ఈవెంట్‌కి భారీగా అభిమానులు తరలివచ్చారు. 

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, దర్శకుడు మారుతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అతను దర్శకుడు కాకముందు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు తన పార్టీ లోగోని డిజైన్‌ చేశారని, ప్రజారాజ్యం పార్టీపై సాంగ్‌ కంపోజ్‌ చేయించినప్పుడు దానికి తగ్గట్టుగా విజువల్స్ షూట్‌ చేసుకొచ్చాడని, అప్పుడే తనలో దర్శకుడయ్యే క్వాలిటీస్‌ గమనించానని, ఆ దిశగా డైరెక్షన్‌ కోసం ప్రయత్నించమని చెప్పా. ఇప్పుడు మారుతి పెద్ద దర్శకుడయ్యాడు. మున్ముందు మరింత పెద్ద దర్శకుడు కావాలని కోరుకుంటున్నాను. 

అయితే ఈ వేదికగానే తమ మధ్య జరిగిన మరో విషయాన్ని వెల్లడించారు. యూవీ క్రియేషన్స్ విక్కీ, వంశీ ఇటీవల తనని కలిశారని, మీతో మారుతితో కలిసి ఓ సినిమా చేయాలనుకుంటున్నామని తెలిపారు. అందుకు చాలా హ్యాపీగా అనిపించింది. మారుతి మా ఇంటి అబ్బాయి. ఓ అభిమానిగా నన్ను ఎలా చూపించాలో తెలుసు. బాగా చూపిస్తాడనే నమ్మకం ఉంది. మీరు చేస్తానంటో నాకు ఓకే అని చెప్పాను. ఇప్పుడు `పక్కా కమర్షియల్‌` ఈవెంట్‌ స్టేజ్‌ పై నుంచి హామీ ఇస్తున్నా.. మీరనుకున్నది వర్కౌట్‌ చేయాలని, తాను సినిమా చేసేందుకు సిద్ధమే అని తెలిపారు. స్టేజ్‌పైనే బేరం కుదిర్చేస్తున్నా అంటూ కామెడీ పంచాడు చిరంజీవి. 

మొత్తంగా ఈ ఈవెంట్‌ని మారుతికి స్పెషల్‌ చేసేశారు చిరంజీవి. దీంతో దర్శకుడు మారుతి ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. ఆనందంలో చిరు కాళ్లపై పడబోయాడు మారుతి. అయితే నెక్ట్స్ మారుతి.. ప్రభాస్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. బహుషా ఆ తర్వాత చిరంజీవి సినిమా వర్కౌట్‌ అయ్యే ఛాన్స్ ఉంది. చిరంజీవి ప్రస్తుతం మోహన్‌రాజాతో `గాడ్‌ ఫాదర్‌`, మెహర్‌ రమేష్‌తో `భోళాశంకర్‌`, బాబీతో `మెగా154`(వాల్తేరు వీరయ్య) సినిమాలు చేస్తున్నారు. వెంకీ కుడుములతో ఓ సినిమా చేయాల్సి ఉంది.
 

click me!