క్రేజీ న్యూస్.. మరో చిత్రానికి సైన్ చేసిన రామ్.. బోయపాటితో భారీ యాక్షన్ ఫిల్మ్

By telugu teamFirst Published Aug 30, 2021, 9:38 AM IST
Highlights

ఎనెర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం యాక్షన్ మూవీస్ చేసే మూడ్ లో ఉన్నట్లున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ తర్వాత రామ్ ఎక్కువగా యాక్షన్ ఫిలిమ్స్ పై ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఎనెర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం యాక్షన్ మూవీస్ చేసే మూడ్ లో ఉన్నట్లున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ తర్వాత రామ్ ఎక్కువగా యాక్షన్ ఫిలిమ్స్ పై ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. తాజా విశ్వసనీయ సమాచారం మేరకు రామ్ భారీ యాక్షన్ చిత్రానికి సైన్ చేసినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో చేస్తున్న చిత్రం కూడా యాక్షన్ మూవీనే. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ యాక్షన్ కథలనే ఎక్కువగా వింటున్నారట. తాజాగా రామ్ బోయపాటి చిత్రానికి పచ్చ జెండా ఊపారు. బోయపాటి చిత్రాల్లో మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

బోయపాటి, రామ్ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం బోయపాటి.. బాలయ్యతో 'అఖండ' చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. ఇటీవల బోయపాటి కేజీఎఫ్ హీరో యష్ కి కథ నేరేట్ చేశాడు అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఫైనల్ గా రామ్ తో చిత్రం ఓకె అయింది. 

భద్ర, సింహా, లెజెండ్, సరైనోడు, తులసి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ బోయపాటి ఖాతాలో ఉన్నాయి. లింగుస్వామి దర్శకత్వంలో రామ్ నటిస్తున్న చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ చేస్తోంది. 

click me!