Latha Mangeshkar: ఇంకా ఐసీయూలోనే స్వరదిగ్గజం లతా మంగేష్కర్ .. ఆందోళనలో అభిమానులు..

By Mahesh JujjuriFirst Published Jan 16, 2022, 12:29 PM IST
Highlights

బాలీవుడ్ స్వరదిగ్గజం.. 92 ఏళ్ల లతా మంగేష్కర్(Latha Mangeshkar) కరోనాతో ఇంకా పోరాడుతూనే ఉన్నారు. దాదాపు వారం రోజులుగా ఆమె ఐసీయూలోనే ఉన్నారు. దాంతో ఏం జరుగుతుందో తెలియక అభిమానులు ఆందోళనలో ఉన్నారు.

బాలీవుడ్ స్వరదిగ్గజం.. 92 ఏళ్ల లతా మంగేష్కర్(Latha Mangeshkar) కరోనాతో ఇంకా పోరాడుతూనే ఉన్నారు. దాదాపు వారం రోజులుగా ఆమె ఐసీయూలోనే ఉన్నారు. దాంతో ఏం జరుగుతుందో తెలియక అభిమానులు ఆందోళనలో ఉన్నారు.

ఉత్తరాది గానకోకిల.. స్వర సరస్వతి, విఖ్యత గాయని లతా మంగేష్కర్ (Latha Mangeshkar) ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. ఆమె ఇంకా కరోనాతో పోరాడుతూనే ఉంది. వారం క్రితం కరోనా బారిన పడిన ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అప్పటి నుంచీ ఆమెను ఐసీయూలోనే ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. మొదటి ఆమె ఆరోగ్యం బాగానే ఉంది అని ఫ్యామిలీ మెంబర్స్ మీడియాకు చెప్పారు. అటు డాక్టర్స్ కూడా పరిస్థితి బాగానే ఉంది. ఎటువంటి ఆందోళన అవసరం లేదు అని చెప్పడంతో..  అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు.

 కాని లతా జీ మంగేష్కర్ (Latha Mangeshkar)  హస్పిటల్ లో చేరి వారం రోజులు అవుతుంది. ఇంత వరకూ ఆమె కోలుకున్నట్టు న్యూస్ రాలేదు. కనీసం ఐసీయూ నుంచి కూడా బయటకు రాలేదట లతాజీ. ఇంకా కోలుకునే దాకా.. హస్పిటల్ లోనే.. అందులోను ఐసీయూ లోనే ఉంచాలని డాక్టర్స్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దాంతో అభిమానుల్లో ఒకింత ఆందోళ మొదలయ్యింది. తమ ఆరాధ్య గాయనిని గురించి శుభవార్త చెప్పాలంటూ వారు వేడుకుంటున్నారు.

కాని  ఆమె ఇంకా కోలుకోవల్సింద చాలా ఉందని.. గ్రేట్ సింగర్ త్వరగా కోలుకోవాలని అభిమానులంతా దేవుడిని ప్రార్ధించాలి అంటూ.. డాక్టర్స్ సైతం పిలుపునిచ్చినట్టు సమాచారం. అంతే కాదు లతా మంగేష్కర్ మంగేష్కర్ (Latha Mangeshkar)  ఆరోగ్యం గురించి చెప్పాలంటే ఇంకా టైమ్ పడుతుందట.. ఇంకా ఓ పదిరోజుల వరకూ ఆమె ఐసీయూలోనే ఉండాల్సి వస్తుందంటున్నారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక అభిమానులు కంగారు పడుతున్నారు. ఇన్ ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.

అటు లతా మంగేష్కర్ సోదరి..ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఆశా భోంస్లే(Asha Bhosle) కూడా ఈ విషయం పై స్పందించారు. తన సోదరిని చూడటానికి హాస్పిటల్ వర్గాలు అనుమతించడం లేదు. కరోనా కారణంగా ఎవరిని దగ్గరకు వెళ్ళనివ్వడం లేదు. అయినా సరే ఎవరూ కంగారు పడవద్దు.. ఆమె కోలుకుంటున్నారు. త్వరలో మన ముందు వస్తారంటూ.. ఆశ ఆశాభావం వ్యక్తం చేశారు.


 

 

click me!