కరోనా కాలం.. నటుడి ముఖం మీద తుమ్మిన వృద్ధుడు

By Satish ReddyFirst Published May 25, 2020, 11:56 AM IST
Highlights

బాలీవుడ్‌ కమెడియన్‌ లాక్‌ డౌన్ నింబంధనలు ఉల్లఘించినట్టుగా మీడియాలో కొద్ది రోజలుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సదరు కమెడియన్‌ వీర్ దాస్‌ అసలు ఏం జరిగిందన్న విషయాన్ని బయట పెట్టాడు.

గతంలో ఓ వ్యక్తిని ఇబ్బంది పెట్టాలంటే కొట్టడమో తిట్టడమో చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఉమ్మివేయటం, తుమ్మటం కూడా భౌతిక దాడుల లిస్ట్‌లో చేరిపోయాయి. కరోనా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి తుమ్మటం ద్వారానే సంక్రమిస్తుండటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగితే ఒకరి ముఖం మీద ఒకరు తుమ్మటం లాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటుడు వీర్ దాస్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. తాజాగా బాలీవుడ్ కమెడియన్ వీర్‌ దాస్ లాక్‌ డౌన్‌ ఉల్లంఘనలకు పాల్పడ్డట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో ఆ వార్తలపై వీర్ దాస్ స్పందించాడు.

తన మీద అటువంటి వార్తలు రావటం వెనుక కారణం ఎవరో వీడియోతో సహా పోస్ట్ చేశాడు వీర్‌ దాస్‌. కొద్ది రోజుల క్రితం వీర్‌ దాస్‌ తన బిల్డింగ్‌లో ఉండే కొంత మందితో కలిసి డిన్నర్ ప్లాన్‌ చేశాడు. డిన్నర్‌ ప్రీపేర్ అవుతుండగా అక్కడే లాన్‌లో అంతా సోషల్ డిస్టాన్స్‌ మెయిన్‌టైన్‌ చేస్తూ కూర్చున్నారు. అదే సమయంలో వీర్ దాస్‌ కొంచెం పక్కకు వచ్చి సిగరెట్‌ కాలుస్తున్నాడు. అదే సమయంలో పక్క ఇంటి వ్యక్తి వీర్‌ దాస్‌ను లాక్‌ డౌన్‌ నింబంధనలు ఉల్లంగించాడంటూ దూషించటం మొదలు పెట్టాడు.

అంతేకాదు మరింత దగ్గరగా వచ్చి వీర్‌ దాస్‌ ముఖం మీద తుమ్మాడు. అందుకు వీర్‌ దాస్ అభ్యంతరం చెప్పినా నేను ఇలాగే చేస్తానంటూ మాట్లాడాడు. వీర్‌ దాస్‌ `నేను నా ఇంటి మెట్ల మీదే ఉన్నాను. నిబంధనలు ఉల్లంఘించలేని ఎంత చెపుతున్నా వినకుండా దూషణలకు దిగాడు` అని వివరించాడు. అయితే వీర్ దాస్‌ అలా ఎందుకు ప్రవర్తించాడో కూడా వివరించాడు. ఈ మేరకు ఆ వ్యక్తి దూషణలకు దిగిన వీడియోతో పాటు అసలు అక్కడ ఏం జరిగింది అన్న విషయాలను సవివరంగా తన ట్విటర్‌ పేజ్‌లో పోస్ట్ చేశాడు.

Lockdown Neighbour. I was giving my friend Kavi who lives three houses down from me some dinner. We were waiting for it to get cooked 15 feet away from each-other. Me on my doorstep, him out. This happened. 🤦🏻‍♀️ pic.twitter.com/YKgErSxqBC

— Vir Das (@thevirdas)
click me!