`బీబీటీవీ టాలెంట్‌ షో` తప్ప మిగతాదంతా బోరింగ్‌

By Aithagoni RajuFirst Published Sep 16, 2020, 11:04 PM IST
Highlights

బిగ్‌బాస్‌4 పదో రోజు ఎపిసోడ్‌ `బీబీటీవీ టాలెంట్‌ షో తప్పితే మిగతాదంతా బోరింగ్‌గా సాగింది. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. 

బిగ్‌బాస్‌4 పదో రోజు ఎపిసోడ్‌ `బీబీటీవీ టాలెంట్‌ షో తప్పితే మిగతాదంతా బోరింగ్‌గా సాగింది. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బీబీటీవీ టాలెంట్‌షో గురించి కుమార్‌ సాయి వివరించారు. ఇందులో నోయల్‌, లాస్య జడ్జ్ లుగా వ్యవహరించగా, అరియానా యాంకర్‌గా వ్యవహరించారు. ఈ షో ద్వారా తమ ప్రతిభని చాటుకోవాలని తెలిపారు. 

దీని కోసం సోహైల్‌, మోనాల్‌ జంటకి, అలాగే హారిక, మెహబూబ్‌ జంటలకు అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ డాన్స్‌ స్టెప్పులు నేర్పించారు. పదో రోజు రాత్రి ఈ షో ప్రారంభమైంది. మొదటగా అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ డాన్స్ చేశాడు. కానీ ఆయన రేంజ్‌లో చేయలేకపోయాడు. అయినా అమ్మ రాజశేఖర్‌పై జడ్జ్ లాస్య సెటైర్లు వేసింది. అందుకు తగ్గట్టే ఆయన పంచ్‌లు వేసి నవ్వించాడు. మరో జడ్జ్ నోయల్‌ ఆయన నెంబర్‌ వన్‌ మార్క్ ఇచ్చాడు. 

రెండో జంటగా సోహైల్‌, మోనాల్‌ కలిసి `వాన వాన ` పాటకి డ్యూయెట్‌ వేశారు. తమదైన స్టయిల్‌లో డాన్స్ చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ వీరిద్దరిలో పెద్దగా ఊపు కనిపించలేదు. వీరి ప్రదర్శనపై జడ్జ్ నోయల్‌ వెళ్ళి మరీ వెరీ గుడ్‌ పర్‌ఫెర్మెన్స్ అని మోనాల్‌ని హత్తుకున్నారు. లాస్య కూడా హత్తుకుంది. సోహైల్‌, మోనాల్‌ డాన్స్ హాట్‌గా ఉందంటూ లాస్య ప్రశంసించింది. అయితే మోనాల్‌..సోహైల్‌తో డాన్స్ వేసేటప్పుడు అఖిల్‌ ఫేస్‌ వాడిపోయినట్టుగా కనిపించడం విశేషం. 

ఈ బీబీ టాలెంట్‌ షోలో బ్రేక్‌ ఉండటం, ఆ బ్రేక్‌లో కమర్షియల్‌ యాడ్ మాదిరిగా దేవి నాగవల్లి, కరాటే కళ్యాణి చేసిన యాక్టింగ్‌, అభిజిత్‌, అఖిల్‌ బప్‌చిక్‌ పాడ్స్ అంటూ రావడం ఆద్యంతం ఆకట్టుకుంది. నిజం చెప్పాలంటే ఇదే హైలైట్‌ అయ్యింది.

ఆ తర్వాత దేత్తడి హారిక, మెహబూబ్‌ ఎనర్జిటిక్‌ సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులేశారు. హౌజ్‌ మొత్తాన్ని ఊపుఊపింది. సభ్యులు బాగా ఎంజాయ్‌ చేశారు. గంగవ్వ సైతం తన పాటతో అలరించింది. కానీ మెప్పించలేకపోయింది. చివరగా బీబీ టాలెంట్‌ షోలో మేల్‌ స్టార్‌ పర్‌ఫెర్మెర్‌గా మెహబూబ్‌ని ఎంపిక చేశారు. గంగవ్వతో మెడల్‌ని అందించారు. లేడీ స్టార్‌ పర్‌ఫెర్మెర్‌గా దేత్తడి హారికని ఎంపిక చేసి మెడల్‌ అందించారు.  చివరకు అందరు కలిసి డాన్స్ వేసి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇలా ఈ షో తప్ప పదో రోజు బోరింగ్‌గా సాగిందనే చెప్పాలి. 

click me!