థూ అనేంత తప్పు ఏం చేశాడు, మా రక్తం మరిగిపోయింది... ప్రియాంక, శోభాపై  భోలే చెల్లి, అమ్మ ఫైర్!

By Sambi Reddy  |  First Published Oct 19, 2023, 3:21 PM IST

ఈ వారం నామినేషన్స్ లో భోలే షావలితో ప్రియాంక, శోభా ఫైట్ తారా స్థాయికి చేరింది. భోలే బూతులు తిట్టాడని ఆరోపిస్తూ సీరియల్స్ బ్యాచ్ దాడికి దిగారు. దీనిపై భోలే కుటుంబ సభ్యులు స్పందించారు...


దాదాపు హౌస్ మొత్తం భోలేని టార్గెట్ చేశారు. భోలే మాటతీరు, ఆటతీరు సరిగా లేదని నామినేట్ చేశారు. దాదాపు అందరితో భోలే కూల్ గా ఉన్నాడు. ప్రియాంక, శోభా విషయంలో ఆయన కొంచెం సహనం కోల్పోయాడు. ఈ క్రమంలో వారిని ఉద్దేశించి కాకపోయినా ఫ్లోలో బూతులు అనేశాడు. ఈ విషయాన్ని ప్రియాంక, శోభా తప్పుబట్టారు. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిజానికి అంత రియాక్ట్ అవసరం లేదు. ప్రియాంక అయితే థూ అని భోలే ఎదుట ఊచింది. నేను తిరిగి అదే పని చేస్తే నీ బ్రతుకు ఏంటని భోలే అన్నాడు. 

ప్రియాంక-శోభా కలిసి భోలేను అంతగా అవమానించడంపై కుటుంబ సభ్యులు స్పందించారు. తల్లి, సిస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. భోలే తల్లి మాట్లాడుతూ... భోలే చాలా మంచివాడు. పది మంచికి అన్నం పెట్టే మంచి మనసున్నవాడు. నన్ను ఎంతగానో గౌరవిస్తాడు. ఎక్కడికెళ్లినా నా కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటాడు. ప్రియాంక నా కొడుకును థూ అని ఎందుకు అన్నదో అర్థం కావడం లేదు. వాడు అందరితో కలిసిపోవాలని అనుకుంటున్నాడు. కానీ కలవడం లేదు, దూరం పెడుతున్నారు అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. 

Latest Videos

అనంతరం భోలే షావలి సిస్టర్ మాట్లాడుతూ... మా అన్నయ్య మంచి తనాన్ని హౌస్లో వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. ప్రియాంక థూ అనేంత తప్పు ఏం చేశాడు. శోభా శెట్టి నోరేసుకుని పడిపోయింది. వాళ్ళు ఎంత చీదరించుకున్నా మా అన్నయ్య కూల్ గానే సమాధానం చెప్పాడు. అంతగా వాళ్ళు టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. సీరియల్ బ్యాచ్ ప్రియాంక, శోభా శెట్టి మొదటి నుండి యాటిట్యూడ్ చూపిస్తున్నారు. వాళ్లకు ఫ్యాన్స్ ఉంటే ఉండొచ్చు. కానీ మా అన్నయ్యను అవమానించడం సరికాదు. నామినేషన్స్ చూస్తుంటే మా రక్తం ఉడికిపోయింది. కానీ ఏం చేయలేకపోయాం.. అన్నారు. 
 

click me!