డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ సూర్య ‘సింగం 2’ విలన్,అరెస్ట్

By Surya PrakashFirst Published Sep 30, 2021, 7:09 AM IST
Highlights

సూర్య హీరోగా వచ్చిన సింగం 2 సినిమాలో నటించిన నైజీరియన్ నటుడు చెకుమావే మాల్విన్ డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోయాడు. 


తెర మీద విలన్ వేషాలు వేసేవారు నిజ జీవితంలో సాధారంగా రివర్స్ ఉంటూంటారు. చాలా మంచి పేరుతో ముందుకు వెళ్తూంటారు. కానీ ఒక్కోసారి తెరకు,నిజ జీవితానికి తేడా లేకుండా పోతుంది. తెరపై చేసే నటన నిజ జీవితంలో నిజమై కూర్చుంటుంది. అలాంటి సంఘటనే తాజాగా జరిగింది. సూర్య హీరోగా వచ్చిన సింగం 2 సినిమాలో నటించిన నైజీరియన్ నటుడు చెకుమావే మాల్విన్ డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోయాడు. 2013లో హరి తెరకెక్కించిన సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్టైనర్ సింగం 2 సినిమాలో మెయిన్ విలన్ డాని పక్కన సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాడు ఈయన. బెంగళూరు కాడుగూండనహళ్లి పోలీసులు అతడ్ని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. బిజినెస్ మ్యాన్‌తో పాటు కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఈయన్ని పట్టుకున్నారు బెంగళూరు పోలీసులు. 

అతడి నుంచి 15 గ్రాముల MDMAతో పాటు 250 మిల్లీలీటర్ల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 15 లక్షల వరకు ఉంటుందని తెలిపారు పోలీసులు. ఇతడి నుంచి చాలా మంది మొబైల్ నెంబర్స్ కూడా తీసుకున్నారు పోలీసులు. అలాగే మాల్విన్ నుంచి పెద్ద మొత్తంలో మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి నుంచి కీలక సమాచారం రాబట్టనున్నారు ఈస్ట్ బెంగళూరు పోలీసులు. ఈ డ్రగ్స్ ఆపరేషన్ పక్కా ప్రణాళికతో పూర్తి చేసారు బెంగళూరు పోలీసులు. 

చాక్​విమ్ .. కన్నడ సహా హిందీ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో కనిపించాడు. అన్నబాండ్​, పరమాత్మ వంటి 20 కన్నడ సినిమాల్లో, తమిళ్​లో సింగం, విశ్వరూపం సినిమాల్లో నటించి మెప్పించాడు. మెడికల్​ వీసాపై భారత్​కు వచ్చిన చాక్​విమ్​... ముంబయి లోని న్యూయార్క్​ ఫిల్మ్​ అకాడమీలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. అంతకుముందు.. 2006లో అతడు ఆరు నెలలపాటు నైజీరియా రాజధాని అబుజాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ లోనూ శిక్షణ తీసుకున్నాడు.ఎక్కువగా నెగిటివ్ క్యారెక్టర్స్‌లోనే కనిపించాడు ఈయన. అలాగే సినిమాల్లో కూడా డ్రగ్స్ అమ్మే పాత్రలోనే ఈయన కనిపించాడు. సినిమాల్లో కాకుండా నిజజీవితంలో కూడా ఇదే కేసులో అరెస్టయ్యాడు. 

లాక్​డౌన్​ సమయంలో సినిమా అవకాశాలు రాకపోగా... చాక్​విమ్​ డ్రగ్స్  అమ్మకాలు ప్రారంభించినట్లు పోలీసులు చెప్పారు. కాలేజీ విద్యార్థులు, వ్యాపారులకు అతడు డ్రగ్స్​ సరఫరా చేశాడని తెలిపారు. ఆఫ్రికా నుంచి అక్రమంగా తరలించిన డ్రగ్స్​ను అతడు విక్రయించేవాడని పేర్కొన్నారు. కాడుగూండనహళ్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో మత్తుపదార్థాలను విక్రయిస్తుండగా తాము రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నామని వెల్లడించారు. 
 

click me!