Aryan Khan Released: జైలు నుంచి విడుదలైన ఆర్యన్ ఖాన్.. జైలుకు వద్దకు వచ్చిన షారుఖ్..భారీగా చేరుకున్న అభిమానులు

By team teluguFirst Published Oct 30, 2021, 11:15 AM IST
Highlights

క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కొడుకు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) నేడు ముంబై జైలు నుంచి విడుదల అయ్యారు. నాలుగు వారాల జైలులో గడిపిన ఆర్యన్ ఖాన్ శనివారం బెయిల్‌పై బయటకు వచ్చారు.

క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కొడుకు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) నేడు అర్థర్‌ రోడ్‌ జైలు నుంచి విడుదల అయ్యారు. నాలుగు వారాల జైలులో గడిపిన ఆర్యన్ ఖాన్ శనివారం బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆర్యన్ ఖాన్‌కు కోర్టు గురువారమే బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. ప్రక్రియ పూర్తి కావడంలో ఆలస్యం జరగడంతో ఆర్యన్ ఖాన్ విడుదల ఆలస్యం అయింది. కొడుకును ఇంటికి  తీసుకెళ్లేందుకు షారుఖ్ ఖాన్ అర్థర్‌ రోడ్‌ జైలుకు చేరుకున్నారు. ఆర్యన్ ఖాన్ విడుదల నేపథ్యంలో జైలు అధికారులు ఆ పరిసర ప్రాంతాల్లో భద్రతను పెంచారు. 

ఆర్యన్ ఖాన్ విడుదల నేపథ్యంలో ముంబైలోని షారుఖ్ ఇంటి వద్దకు ఆయన అభిమానులు భారీగా చేరుకున్నారు. ఆర్యన్‌ ఖాన్ స్వాగతం పలికేందుకు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో అక్కడ వేచి చూస్తున్నారు. వారి చేతుల్లో ‘Welcome Home, Aryan’ అనే పోస్టర్లు కనిపిస్తున్నాయి. 

Also read: Aryan khan bail: భోజనం చేయకుండా కాఫీతో గడిపేసిన షారుక్ ఖాన్... లాయర్ చెప్పిన సంచలన నిజాలు

ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ షిప్‌లో రైడ్ చేసిన ఎన్సీబీ అధికారులు డ్రగ్స్‌ వినియోగించిన ఆరోపణలపై ఆర్యన్‌ ఖాన్‌తో పాటుగా మరికొందరిని అరెస్ట్ చేశారు. అక్టోబర్ 3వ తేదీన వీరి అరెస్ట్‌ను ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ధ్రువీకరించారు.  దీంతో ఒక్కసారిగా షారుఖ్ అభిమానుల్లో, బాలీవుడ్‌లో కలకలం రేగింది. అయితే ఆర్యన్ ఖాన్ తరఫు లాయర్లు మాత్రం.. అతడు డ్రగ్స్ వినియోగించలేదని, అందుకు ఎలాంటి వాదనలు కోర్టులో వాదనలు వినిపించారు. తొలుత కోర్టు ఆర్యన్‌ ఖాన్‌కు అక్టోబర్ 7 వరకు కస్టడీ విధించింది. ఆ తర్వాత మరో 14 రోజుల పాటు కస్టడీకి ఆదేశించింది. దీంతో అక్టోబర్ 8న ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించారు. ఇక, ఆర్యన్ తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.

అక్టోబర్ 26న బాంబే హైకోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆర్యన్ తరఫున సీనియర్ లాయర్లు ముకుల్ రోహత్గీ, సతీశ్ మానెశిందే వాదనలు వినిపించారు. మరుసటి రోజు కూడా కోర్టులో వాదనలు జరిగాయి. ఆ తర్వాత ఎన్సీబీ తరఫు న్యాయవాదులు కూడా కోర్టుకు వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే గురువారం బాంబే కోర్టు ఆర్యన్ ఖాన్‌తో సహా నిందితులుగా మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో షారుఖ్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

Also read: ఫలించిన 23 రోజుల నిరీక్షణ.. ఆర్యన్ ఖాన్‌కు ఊరట, బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్ట్

ఆర్యన్ ఖాన్ బెయిల్ ప్రక్రియ పూర్తి చేయడంలో బాలీవుడ్ నటి జూహీ చావ్లా కీలక భూమిక పోషించారు. ఆర్యన్‌కు బెయిల్‌ కోసం ఆమె పూచీకత్తు ఇచ్చారు. శుక్రవారం ముంబై సెషన్‌ కోర్టుకు వెళ్లారు. అక్కడ ఆర్యన్‌ బెయిల్‌కు పూర్తి బాధ్యత వహిస్తూ లక్ష రూపాయల బాండ్‌ పేపర్లపై సంతకం చేశారు. అయితే శనివారం ఉదయం బెయిల్ ప్రక్రియ పూర్తికావడంతో అర్థర్‌ రోడ్‌ జైలు అధికారులు ఆర్యన్ ఖాన్‌ను విడుద చేశారు. 
 

click me!