బాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఆర్యన్‌ఖాన్‌కు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్‌‌పై విచారణ రేపటికి వాయిదా

By Siva Kodati  |  First Published Oct 13, 2021, 6:23 PM IST

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ (shahrukh khan) ఆర్యన్ ఖాన్ (aryan khan), అర్బాజ్ మర్చంట్ (arbaaz merchant) మరియు మున్మున్ ధమేచాల (munmun dhamecha ) బెయిల్ (bail) పిటిషన్‎లపై విచారణను బొంబే కోర్టు రేపటికి వాయిదా వేసింది.


బాలీవుడ్ డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ (shahrukh khan) ఆర్యన్ ఖాన్ (aryan khan), అర్బాజ్ మర్చంట్ (arbaaz merchant) మరియు మున్మున్ ధమేచాల (munmun dhamecha ) బెయిల్ (bail) పిటిషన్‎లపై విచారణను బొంబే కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈరోజు ఆయన బెయిల్‌కు సంబంధించి ముంబై సెషన్స్ కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఆర్యన్ తరపు లాయర్ అమిత్ దేశాయ్ (amit desai) కోర్టులో తన వాదలను వినిపిస్తూ... ఆర్యన్ వద్ద డబ్బులు లేవని, డబ్బులు లేనప్పుడు డ్రగ్స్ కొనలేడని చెప్పారు. అలాంటప్పుడు ఆర్యన్ డ్రగ్స్ వినియోగించే అవకాశమే లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అదే సమయంలో ఆర్యన్ వద్ద ఎటువంటి డ్రగ్స్ దొరకలేదని చెప్పారు.

అర్బాజ్ మర్చంట్ వద్ద ఆరు గ్రాముల చరస్‌ను అధికారులు గుర్తించారని... ఆ చరస్ ను కూడా అర్బాజ్ సొంతంగా వినియోగించేందుకు తన వద్ద పెట్టుకున్నాడని, అమ్మడానికి కాదని అమిత్ వెల్లడించారు. ఇదే సమయంలో ఆయన మరో అడుగు ముందుకేసి అసలు క్రూయిజ్ లో ఆర్యన్ లేనే లేడని వాదించారు.

Latest Videos

undefined

Also Read:అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌తో ఆర్యన్ ఖాన్‌కు సంబంధాలు: ఎన్‌సీబీ.. ‘డ్రగ్స్ కొనేందుకూ డబ్బులే లేవు’

ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రాఫికింగ్ అనే విషయాన్ని ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) ప్రస్తావించిందని... ఇలాంటి పదాలను వాడటం సరికాదని అమిత్ దేశాయ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేవలం బెయిల్ రాకుండా చేసేందుకే ఎన్సీబీ (ncb) ఇలాంటి పదాలను వాడుతోందని వెల్లడించారు. అంతర్జాతీయ డ్రగ్స్ ట్రాఫికింగ్ తో ఆర్యన్ పేరును ఎలా ముడిపెడతారని అమిత్ దేశాయ్ ప్రశ్నించారు. ఇలాంటి ఎన్నో కేసులను కోర్టు చూసిందని చెప్పారు.

ఆర్యన్ వద్ద నుంచి నిషేధిత డ్రగ్స్ ను గుర్తించకుండానే అంతర్జాతీయ డ్రగ్స్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు. ఆర్యన్ కేసు వెనుక పెద్ద కుట్ర ఉందని అమిత్ దేశాయ్ చెప్పారు. క్రూయిజ్ నుంచే అందరినీ అరెస్ట్ చేయలేదని... కొందరిని బయట కూడా అరెస్ట్ చేశారని వాదించారు. ఆర్యన్ క్రూయిజ్ లో లేడని, ఆయన వద్ద ఏమీ లేదని చెప్పారు. మాదకద్రవ్యాలను పండించడం, ఉత్పత్తి చేయడం, తయారు చేయడం, వినియోగించడం, రవాణా చేయడం వంటివన్నీ అక్రమ రవాణా కిందకు వస్తాయని... ఆర్యన్‌కు వీటిలో ఏ ఒక్క దానితో సంబంధం లేదని అమిత్ దేశాయ్ తెలిపారు. ఈ వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది. 

click me!