తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

Published : Oct 11, 2018, 11:32 AM ISTUpdated : Oct 11, 2018, 11:34 AM IST
తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

సారాంశం

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు గత కొంత కాలంగా యూఎస్ లో మంచి కలెక్షన్స్ రాబడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అరవింద సమేత కూడా ఎవరు ఊహించని స్థాయిలో డాలర్ల వర్షం కురిపిస్తోంది. ప్రీమియర్స్ ద్వారానే దాదాపు బయ్యర్స్ సేఫ్ జోన్ లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. 

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు గత కొంత కాలంగా యూఎస్ లో మంచి కలెక్షన్స్ రాబడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అరవింద సమేత కూడా ఎవరు ఊహించని స్థాయిలో డాలర్ల వర్షం కురిపిస్తోంది. ప్రీమియర్స్ ద్వారానే దాదాపు బయ్యర్స్ సేఫ్ జోన్ లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ జై లవకుశ రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసింది. 

గత ఏడాది వచ్చిన ఎన్టీఆర్ జై లవకుశ $589,219 లను అందుకోగా అరవింద సమేత ప్రీమియర్స్ ఇంకా పూర్తికాకుండానే ఆ మార్క్ ని దాటేసింది. త్రివిక్రమ్ సినిమాలకు అమెరికాలో మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ రాత్రి 10గంటల సమయానికి ప్రీమియర్స్ ద్వారా $689,983 అందాయి. 194 లొకేషన్స్ లో షోలను ప్రదర్శించగా ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకుంది. 

ఇక రంగస్థలం $725k మార్క్ ను దాటేయడం ఈజీ అని చెప్పవచ్చు. అలాగే భరత్ అనే నేను $850k కలెక్షన్స్ ను దాటితే అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూలు చేసిన ఆరవ తెలుగు చిత్రంగా రికార్డుకెక్కుతుంది. మరి తారక్ ఎంతవరకు రాబడతాడో చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు.

 

సంబంధిత వార్తలు

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత

ట్విట్టర్ రివ్యూ: అరవింద సమేత

'అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

అరవింద సమేత కోసం స్పెషల్ హాలిడే ఇచ్చేశారు!

‘అరవింద సమేత’విడుదల.. టీడీపీ, వైసీపీ గొడవ

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌