ప్రభాస్ లవ్ స్టోరీ టైటిల్ మార్చేశారు?

Published : Oct 11, 2018, 11:13 AM IST
ప్రభాస్ లవ్ స్టోరీ టైటిల్ మార్చేశారు?

సారాంశం

స్టార్ హీరోలలో అందరూ ఏడాదికో సినిమాను విడుదల చేస్తుంటే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం బాహుబలి రిలీజ్ చేసి ఏడాది అయిపోయినా మరో సినిమాను విడుదల చేయలేదు. మరో సినిమా వచ్చే సమయానికి దాదాపు రెండేళ్ల గ్యాప్ ఉంటుందని అర్థమైంది. 

స్టార్ హీరోలలో అందరూ ఏడాదికో సినిమాను విడుదల చేస్తుంటే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం బాహుబలి రిలీజ్ చేసి ఏడాది అయిపోయినా మరో సినిమాను విడుదల చేయలేదు. మరో సినిమా వచ్చే సమయానికి దాదాపు రెండేళ్ల గ్యాప్ ఉంటుందని అర్థమైంది. మొన్నటివరకు సాహో సినిమాతో బిజీగా వున్న ప్రభాస్ ఇప్పుడు మరో లవ్ స్టోరీని స్టార్ట్ చేశాడు. 

జిల్ ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరీకి గత ఏడాదే ఒకే చెప్పిన ప్రభాస్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి మాత్రం చాలా టైమ్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ స్పీడ్ పెంచాడు. ఇకపోతే సినిమాకు ఆమూర్ అనే ప్రెంచ్ పదాన్ని టైటిల్ గా సెట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దర్శకుడు మరో టైటిల్ ను అనుకుంటున్నట్లు టాక్. 

సినిమా తెలుగుతో పాటు హిందీ తమిళ్ లో కూడా తెరకెక్కుతుండడంతో అందరికి అర్థమయ్యేలా ఉండాలని జాన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పునర్జన్మల నేపథ్యంలో ఉండే ఈ సినిమా రొమాంటిక్ గా సాగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Sobhita Dhulipala: 45కోట్ల ఇంట్లో నాగచైతన్య, శోభితా.. పెళ్లికి ముందే అంతా ప్లాన్‌.. స్పెషాలిటీ ఏంటో తెలుసా?
పక్కోడి జీవితం నీకెందుకు బాసూ.! వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్ ఇన్‌స్టా పోస్ట్..