అరవింద సమేత సెన్సార్ వర్క్ ఫినిష్.. టాక్ ఏంటంటే?

By Prashanth MFirst Published Oct 8, 2018, 6:26 PM IST
Highlights

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన అరవింద సమేత మొత్తానికి అన్ని పనులను పూర్తి చేసుకొని విధులకు సిద్ధమైంది. ఫ్యాక్షన్ గొడవల తరువాత పరిస్థితి ఏంటి అనే అంశాన్ని మహిళల మనో వేదన నుంచి త్రివిక్రమ్ కథను అల్లిన సంగతి తెలిసిందే. 

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన అరవింద సమేత మొత్తానికి అన్ని పనులను పూర్తి చేసుకొని విధులకు సిద్ధమైంది. ఫ్యాక్షన్ గొడవల తరువాత పరిస్థితి ఏంటి అనే అంశాన్ని మహిళల మనో వేదన నుంచి త్రివిక్రమ్ కథను అల్లిన సంగతి తెలిసిందే. దీంతో వీర రాఘవగా కథానాయకుడు చేపట్టిన యజ్ఞం ఏమిటన్నది అందరిలో ఆసక్తిని రేపుతోంది. 

ఫైనల్ గా సినిమా సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుంది. యాక్షన్, రక్త పాత సన్నివేశాలు ఉండడంతో చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఎమోషన్ తో పాటు ఎన్టీఆర్ కి తగ్గట్టుగా యాక్షన్ సన్నివేశాలని త్రివిక్రమ్ అద్భుతంగా తెరకెక్కించినట్లు సెన్సార్ యూనిట్ నుంచి టాక్ వస్తోంది. ప్రతి సీన్ లో త్రివిక్రమ్ శైలికి తగ్గట్టుగా  డైలాగ్స్ ఆలోచింపజేస్తాయట. 

కథలో సునీల్ పాత్ర మరో హైలెట్ గా పాయింట్ అని తెలుస్తోంది. సినిమా ఆ పాత్ర మొత్తం ఉంటుందని త్రివిక్రమ్ ముందే చెప్పాడు. దీంతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా దసరా సెలవుల్లో చిత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుందని చెప్పవచ్చు. ఏపి ప్రభుత్వం అరవింద సమేత కోసం ఉదయం 5 గంటల నుంచి 11 గంటల మధ్యలో రెండు స్పెషల్ షోలకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.  

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అరవింద సమేత. గతంలో ఎప్పుడు లేని విధంగా భారి అంచనాలతో తారక్ సినిమా విడుదల కాబోతోంది. త్రివిక్రమ్ కూడా మంచి కసి మీద సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ తోనే క్లారిటీ వచ్చేసింది. ఇక మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. 

అసలు మ్యాటర్ లోకి వస్తే..ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్పెషల్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. నాలుగు ఆటలు కాకుండా అరవింద సమేత రోజు ఆరు ఆటలతో ఆంధ్రా అభిమానుల ముందుకు రానుంది. ప్రిన్సిపాల్ సెక్రటరీ టు గవర్నమెంట్ నుంచి అధికారికంగా లేఖను కూడా విడుదల చేశారు. 

అరవింద సమేత 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు నుంచి దసరా సందర్బంగా ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఉదయం 5 గంటల నుండి 11 గంటల మధ్యలో రెండు స్పెషల్ షోలు ఎక్స్ట్రా గా పదర్శించుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు థియేటర్స్ కు స్పెషల్ షోల కోసం అనుమతులు ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగలో బంపర్ అఫర్ వచ్చింది అంటూ సంబరపడుతున్నారు.    

 

అరవింద సమేత స్పెషల్ షోలు.. ఫ్యాన్స్ కు బంపర్ అఫర్!

అరవింద సమేతపై చంద్రబాబు ప్రేమ: జూ.ఎన్టీఆర్ పై సాఫ్ట్

'అరవింద సమేత'పై కావాలని కుట్ర పన్నారా..?

తల్లి, కొడుకులు తిని కూర్చునే టైప్.. ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మొదటి సారి సాయం కోరిన త్రివిక్రమ్!

అరవింద సమేత... బాహుబలి రికార్డులు బద్దలవుతాయ?

రెడ్డి ఇక్కడ సూడు.. సాంగ్ కోసం రెడీగా ఉండండి!

అరవింద సమేత ఫొటో కార్డ్ డిజైన్స్ (ఫొటోలు)

అరవింద సమేత: తారక్ పాత్ర గురించి త్రివిక్రమ్ కామెంట్!

click me!