ఆంటీ అన్నవారిపై కేసు ఫైల్ చేసిన అనసూయ... కంప్లైంట్ రిఫరెన్స్ ఐడి ఇదిగో!

By Sambi ReddyFirst Published Aug 29, 2022, 5:07 PM IST
Highlights

ఆంటీ అని ట్రోల్ చేసిన వారిపై చర్యలు తీసుకునే దిశగా అనసూయ అడుగులు వేస్తున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుకు సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించినట్లు తెలియజేశారు.

లైగర్ మూవీ ఫెయిల్యూర్ ని ఉద్దేశిస్తూ పరోక్షంగా అనసూయ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. గతంలో హీరో విజయ్ దేవరకొండ అమ్మను తిట్టాడు, దాని కర్మ ఫలితమే లైగర్ చిత్రానికి డిజాస్టర్ టాక్ అన్న అర్థంలో అనసూయ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని హర్ట్ చేయడంతో వివాదం రాజుకుంది. సోషల్ మీడియా ద్వారా అనసూయను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆంటీ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. 

అదే సమయంలో అనసూయను జబర్దస్త్ కామెడీ ఆధారంగా, ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ఆధారంగా విమర్శించారు. తనను ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరి పై చర్యలు తీసుకుంటానని అనసూయ హెచ్చరించారు. ముఖ్యంగా ఆంటీ అనడం ఏజ్ షేమింగ్ క్రిందకు వస్తుంది. దానికి పాల్పడుతున్న వారి ట్వీట్స్ స్క్రీన్ షాట్స్ తీసి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తాను అన్నారు. అన్నట్లుగానే సైబర్ క్రైమ్ పోలీసులకు అనసూయ పిర్యాదు చేయారు. 

And the process begins 🙏🏻Took my time to not do this to save the future of a lot of impulsive youth/people..but looks like what has to be done..should be done..thanking the cyber crime officials for being very supportive prompt and promising🙏🏻 pic.twitter.com/gxBinHkG8X

— Anasuya Bharadwaj (@anusuyakhasba)

తన ఫిర్యాదుకు సంబందించిన రిఫరెన్స్ నంబర్, మెస్సేజ్ అనసూయ షేర్ చేశారు. ఆపై ఓ ట్వీట్ చేశారు. చర్యలకు సంబంధించిన ప్రాసెస్ మొదలైంది. వాళ్ళ భవిష్యత్ పాడవుతుందని కంప్లైంట్ చేయాలా వద్దా అని చాలా ఆలోచించాను. లాభం లేదు జరగాల్సింది జరగాల్సిందే. నా కంప్లైంట్ కి స్పందించి మద్దతుగా నిలిచిన సైబర్ పోలీసులకు ధన్యవాదాలు... అంటూ అనసూయ ట్వీట్ చేశారు. మరి అనసూయ కంప్లైంట్ తో ఎంత మందికి శిక్షపడుతుందో చూడాలి. 

click me!