‘‘రేప్ జరిగిందేమో.. కానీ నేను చేయలేదు’’

By ramya neerukondaFirst Published Oct 9, 2018, 4:35 PM IST
Highlights

బలవంతంగా మద్యం తాగించి తనను రేప్ చేశాడని ఆమె పేర్కోన్నారు. కాగా.. ఈ ఆరోపణలపై అలోక్ నాథ్ విచిత్రంగా స్పందించాడు.

బాలీవుడ్ లో మీటూ ఉద్యమం రోజురోజుకి ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రముఖ సినీ, టీవీ నటుడు అలోక్ నాథ్ తనపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడని ప్రముఖ రచయిత, ప్రొడ్యూసర్ వింటా నందా ఆరోపించారు. బలవంతంగా మద్యం తాగించి తనను రేప్ చేశాడని ఆమె పేర్కోన్నారు. కాగా.. ఈ ఆరోపణలపై అలోక్ నాథ్ విచిత్రంగా స్పందించాడు.

ఆరోపణలపై ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ..‘ ఈ వ్యాఖ్యలను నేను ఖండించవచ్చు. అలాగే అంగీకరించవచ్చు. రేప్‌ కూడా జరిగి ఉండవచ్చు కానీ వేరేవాళ్లేవరో చేసి ఉండొచ్చు. ఈ వ్యాఖ్యలపై నేను అంతగా మాట్లాడకపోవడమే నాకు మంచిది. ఎక్కవగా మాట్లాడితే ఈ విషయం ఇంకా విస్తరిస్తోంది. ఒకానొక సమయంలో ఆమె నాకు మంచి స్నేహితురాలు. కానీ ఇప్పుడు పెద్ద సమస్యగా మారారు. ఆమె ఆరోపణలపై స్పందించడమే ఓ పిచ్చి చర్య. ప్రస్తుత రోజుల్లో ప్రపంచం ఎలా తయారైందంటే ఆడవారేది చెబితే అదే నమ్మెస్తున్నారు. వారు మాట్లాడేది అబద్దమైనా పరిగణలోకి తీసుకుంటున్నారు.’ అని పేర్కొన్నారు. 

read more news

నాతో బలవతంగా మందు తాగించి రేప్ చేశాడు.. నటుడిపై ఆరోపణలు!

click me!