సుశాంత్ సింగ్ కేసు: డ్రగ్స్ డీలర్‌తో సంబంధాలు.. రియాపై కేసు నమోదు

By Siva KodatiFirst Published Aug 26, 2020, 9:03 PM IST
Highlights

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిపై రోజుకొక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటూ కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిపై రోజుకొక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటూ కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఈడీ, సీబీఐ అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. సుశాంత్ కేసులో ఆయనతో సంబంధం వున్న 50 మందిని విచారించిన పోలీసులు.. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని కీలకంగా తీసుకుని ఆధారాలు సేకరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో డ్రగ్స్ డీలర్లతో చేసిన వాట్సాప్ చాట్ బయటకు రావడం సంచలనంగా మారింది. సుశాంత్ మరణానికి ముందు రియా చేసిన కాల్స్, వాట్సాప్ డాటా పరిశీలించిన ఈడీ అధికారులకు.. ఆమె డ్రగ్ డీలర్లతో సంప్రదింపులు జరిపిన సందేశాలు లభ్యమయ్యాయి.

డ్రగ్‌ డీలర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌరవ్‌ ఆర్యతో 2017 నుంచి గౌరవ్‌తో రియా కాంటాక్ట్‌లో ఉన్నట్లు తేలింది. ఈ కేసులో డ్రగ్స్ కోణం నేపథ్యంలో సుశాంత్ ఫ్లాట్‌మేట్ సిద్ధార్థ్ పితాని, కుక్ నీరజ్, హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండా, సుశాంత్ వ్యక్తిగత సిబ్బంది దినేశ్ సావంత్‌లను సీబీఐ ప్రశ్నించనుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టంలోని 20, 22, 27, 29 సెక్షన్ల కింద రియాపై కేసు నమోదైంది. దీనిపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో చీఫ్ రాకేశ్ ఆస్థానా మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ ఇచ్చిన లేఖ ఆధారంగా తాము రియాపై కేసుల నమోదు చేసినట్లు తెలిపారు. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మిథిలీన్‌ డయాక్సీ మెథాంఫేటమిన్ ఆమె ఆరా తీసిందని చెప్పారు. 

click me!