నా 50 మీరు.. మీ 25 నేను చేయాలి: నాని

Published : Apr 17, 2020, 04:06 PM ISTUpdated : Apr 17, 2020, 04:07 PM IST
నా 50 మీరు.. మీ 25 నేను చేయాలి: నాని

సారాంశం

ఏప్రిల్‌ 17 దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు హీరో నాని. ట్విటర్‌ వేదికగా వీ సినిమా కొత్త పోస్టర్‌ను ట్వీట్ చేసిన నాని.. ` మోహన్ సర్... నా 50th మీరే చేయాలి... మీ 25th నేనే చేయాలి... త్వరలోనే మనం సెలబ్రేట్ చేసుకుందాం` అంటూ కామెంట్ చేశాడు.

నేచురల్‌ స్టార్ నానిని హీరోగా వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. తొలి సినిమా అష్టాచమ్మా తోనే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఇంద్రగంటి, హీరోగా నానికి కూడా తిరుగులేని బ్రేక్ ఇచ్చాడు. దీంతో ఇద్దరు క్రేజీ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్నారు. తరువాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన జెంటిల్‌మెన్‌ సినిమా కూడా మంచి విజయం సాధిచటంతో ఈ కాంబినేషన్ మీద మరింత హైప్‌ క్రియేట్ అయ్యింది.

తాజాగా వీరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ సినిమా రూపొందుతోంది. వి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో తొలిసారిగా నానిలోని నెగెటివ్‌ షేడ్‌ ను చూపిస్తున్నాడు దర్శకుడు ఇంద్రగంటి. ఈ సినిమాతో అనుకున్నట్టుగా హ్యాట్రిక్‌ సక్సెస్‌ కొడితే ఇక ఈ కాంబినేషన్లో సినిమా చేసేందుకు స్టార్ ప్రొడ్యూసర్‌లు కూడా క్యూ కడతారు. ఇక రోజు (ఏప్రిల్‌ 17) దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు హీరో నాని.

ట్విటర్‌ వేదికగా వీ సినిమా కొత్త పోస్టర్‌ను ట్వీట్ చేసిన నాని.. ` మోహన్ సర్... నా 50th మీరే చేయాలి... మీ 25th నేనే చేయాలి... త్వరలోనే మనం సెలబ్రేట్ చేసుకుందాం` అంటూ కామెంట్ చేశాడు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న వీ సినిమాలో సుధీర్ బాబు మరో హీరోగా నటిస్తుండగా ఇంద్రగంటి గత చిత్రాల్లో నటించిన నివేదా థామస్‌, అదితిరావ్‌ హైదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా లాక్ డౌన్‌ కారణంగా వాయిదా పడింది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?