పాతబంగారం: గొల్లపూడి-యుద్దనపూడి,ఓ టైప్ ఇనిస్టిట్యూట్

By tirumala ANFirst Published Dec 12, 2019, 6:38 PM IST
Highlights

ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి, ప్రముఖ సినీ రచయిత గొల్లపూడి మారుతిరావు మధ్యన ఓ టైప్ ఇనిస్టిట్యూట్ విషయంలో మొదలైన పరిచయం, స్నేహంగా మారి కడగంటా సాగింది. ఆ వివరాలు చాలా ఆసక్తిగా ఉంటాయి.

ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి, ప్రముఖ సినీ రచయిత గొల్లపూడి మారుతిరావు మధ్యన ఓ టైప్ ఇనిస్టిట్యూట్ విషయంలో మొదలైన పరిచయం, స్నేహంగా మారి కడగంటా సాగింది. ఆ వివరాలు చాలా ఆసక్తిగా ఉంటాయి.

యద్దనపూడి సులోచనరాణి అప్పట్లో ఓ బిజీ నవలా రచయిత్రి. ఆమె భర్త కోసం హైదరాబాద్  చిక్కడపల్లిలో ఒక టైప్ ఇన్‌స్టిట్యూట్‌ని బేరం చేసి తీసుకున్నారు. దాంతో  ఆమె భర్తకి ఒక వ్యాపకాన్ని ఏర్పరచాలని అనుకున్నారు.  ఆ ఇనిస్టిట్యూట్ లో దాదాపు పది పన్నెండు టైపు మిషన్లు ఉండేవి. నేర్చుకునేవారూ వచ్చి వెళ్తూండేవారు. అయితే ఆయనకి ఆ పని  నచ్చలేదు. దాంతో వేరే దారి లేక , తప్పనిసరిగా  ఆ టైప్ ఇన్‌స్టిట్యూట్‌ని అమ్మెయ్యాలని ఆమె నిశ్చయించుకున్నారు.

అప్పట్లో పూల రంగడు సినిమా చేస్తున్నారు గొల్లపూడి. స్క్రిప్టు నిమిత్తం ఆమెను తరుచు కలుస్తున్న కారణంగా ఈ విషయం గొల్లపూడి గారికి తెలుస్తూనే ఉంది. ఈ దశలోనే గొల్లపూడి  తండ్రి ఉద్యోగం నుంచి రిటైరవడం, హైదరాబాదు రావడం జరిగింది. ఆయన టైపు, షార్టుహాండ్‌లో పిట్‌మాన్ డిగ్రీలు ఉన్నవారు. ఆయనకి ఈ వ్యాపకాన్ని కల్పించగలిగితే- ఈ రూపేణా తన దగ్గర ఉంటారని గొల్లపూడి గారికి ఆలోచన, ఆశ కలిగింది. దాంతో వెంటనే సులోచనారాణిగారిని అడిగాను. దుక్కిపాటీ మధుసూదరావు గారు ఈ ఆలోచనని ప్రోత్సహించారు.

దాంతో గొల్లపూడి గారి తండ్రిని ఒప్పించి  చిక్కడపల్లి ఇన్‌స్టిట్యూట్‌కి తీసుకెళ్లి కూర్చోపెట్టగలిగారు. కాని ఆయన మనస్సుదాకా ఆ వ్యాపకం పోలేదు. రెండో రోజే “ఇప్పుడు ఇలాంటి పని చెయ్యలేను. విశాఖపట్నంలోనే ఉంటాను” అని తేల్చి చెప్పేశారు. నిరుత్సాహం కలిగినా చేయగలిగిందేమీలేదు. గొల్లపూడి నాన్నగారు బండీ ఎక్కారు. ఆ తర్వాత  ఓ  గుమాస్తా ని పెట్టి ఇన్‌స్టిట్యూట్‌ని చూసుకుంటున్నారు.

ఈలోగా గొల్లపూడి గారికి కూడా ట్రాన్సఫర్ వచ్చింది.  ఈసారి విజయవాడకి. రాంచీ, కటక్‌ల తర్వాత ఈ ట్రాన్సఫర్ పెద్ద ఇబ్బందికరమైనది కాదు. ఒక విధంగా ఆనందించారు. భార్య ... పిల్లల్ని తీసుకుని పుట్టింటికి-హనుమకొండకి వెళ్లింది. ట్రాన్సఫర్ కి బయలుదేరాల్సిన రోజులు దగ్గర పడుతున్నాయి. అయితే ‘పూలరంగడు’  డిస్కషన్ నిమిత్తం ఒక సాయంకాలం సికింద్రాబాదు నుంచి హైదరాబాదుకి టాంక్‌బండ్ మీదుగా వస్తున్నారు దుక్కిపాటీ ,గొల్లపూడి. ఉన్నట్టుండి యద్దనపూడి ఇన్‌స్టిట్యూట్‌ ప్రసక్తి వచ్చింది.

ఆమె వ్యవహారాలకు దుక్కిపాటి సంధానకర్తగా ఉండేవారు. ఉన్నట్టుండి గొల్లపూడి గారి మీద విరుచుకుపడ్డారు. ‘మీరు నేడో రేపో విజయవాడ వెళ్లిపోతున్నారు. ఆ టైప్ ఇన్‌స్టిట్యూట్‌ గురించి సులోచనరాణిగారికి తేల్చి చెప్పి వారికి అప్పగించలేదు. మీరు ఏంచేసేదీ ఆమెకి తెలియాలికదా. అంత బాధ్యతలేకపోతే ఎలాగ?’ ఇలా సాగింది వారి ధోరణి. అసలే ఆయన సమక్షంలో గొల్లపూడి గారికి  టెన్షన్ ఒక్కసారి కట్లు తెంచుకుంది. ఆవేశంతో, ఉద్రేకంగా బడబడా ఎదిరించారు.

“మీరు నా పనులన్నీ చూస్తున్నారు. ఒక పక్క ఆఫీసు. సాయంకాలాలు మీతో సీన్ల చర్చ. ఇంకా నేను హైదరాబాదు వదిలి వెళ్లిపోలేదు. ఆమెని కలుసుకోకుండా, మాట్లాడకుండా, ఇన్‌స్టిట్యూట్ అప్పగించకుండా వెళ్ళిపోతాననుకున్నారా? నాగురించి మీరు ఇంతేనా తెలుసుకున్నది. నా మీద నమ్మకం లేకపోతే నేను పనిచెయ్యలేను” అన్నాను. మాటలు తోసుకు వచ్చాయి.  ఆ తర్వాత తాను అలా మాట్లాడినందుకు నొచ్చుకున్నారు గొల్లపూడి. యుద్దనపూడి గారికి విషయం చెప్పి ఆ ఇనిస్టిట్యూట్ ని అప్పగించారు. అలా గొల్లపూడి గారి ఇనిస్టిట్యూట్ వ్యవహారం తేలింది. ఆ తర్వాత యుద్దనపూడి గారితో జీవితాంతం స్నేహంగా ఉన్నారు. గొల్లపూడి గారంతా ఆమె గౌరవంగా చూసేవారు. ఇదంతా కూడా గొల్లపూడి గారు స్వయంగా చెప్పుకున్నదే.

click me!