మా అన్నకు కరోనా సోకలేదు.. సోషల్ మీడియాపై హీరోయిన్‌ ఫైర్‌

Published : Mar 30, 2020, 10:32 AM IST
మా అన్నకు కరోనా సోకలేదు.. సోషల్ మీడియాపై హీరోయిన్‌ ఫైర్‌

సారాంశం

ప్రముఖ టీవీ నటి దివ్యాంక త్రిపాఠి సోదరుడు పైలెట్ కావటంతో ఆయనకు, ఆయన తల్లికి కరోనా సాగినట్టుగా వదంతులు వ్యాపించాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా దివ్యాంక ఘాటుగా స్పందించింది. `నా అన్నకు, తల్లికి కరోనా సోకకపోయినా సోకినట్టుగా ప్రచారం చేయటం దారుణమైన చర్య` అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.

కరోనా భయంతో ప్రజలు వణికిపోతుంటే కొంత మంది ఆకతాయిలు సోషల్ మీడియాలో దారుణమైన ప్రచారాలు మొదలు పెట్టారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ఇలాంటి ప్రచారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చిరిస్తున్నా ఈ ఫేక్‌ న్యూస్‌ తగ్గటం లేదు. తాజాగా ఇలాంటి అనుభవమే ప్రముఖ టీవీ నటి దివ్యాంక త్రిపాఠికి ఎదురైంది. ఆమె సోదరుడు పైలెట్ కావటంతో ఆయనకు, ఆయన తల్లికి కరోనా సాగినట్టుగా వదంతులు వ్యాపించాయి.

దీంతో సోషల్ మీడియా వేదికగా దివ్యాంక ఘాటుగా స్పందించింది. `నా అన్నకు, తల్లికి కరోనా సోకకపోయినా సోకినట్టుగా ప్రచారం చేయటం దారుణమైన చర్య` అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె తన అన్నకు కరోనా సొకలేదని క్లారిటీ ఇచ్చింది. తన వృతిపరంగా విదేశాలకు వెళ్లి రావటంతో ఆయన కావాలనే సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉంటున్నారని దివ్యాంక స్పష్టం చేసింది.

`నా సోదరుడికి ఎలాంటి కరోనా వైరస్‌ లక్షణాలు లేకున్నా ముందు జాగ్రత్త చర్యగా ఇతర విమానయాన ఉద్యోగుల్లాగే అతను కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. కరోనా వైరస్‌ షేమింగ్‌ ఆపండి. మనం మనుషులుగా వ్యవహరించండి, మానవత్వాన్ని కోల్పోకండి` అంటూ తన సోషల్  మీడియా పేజ్‌ ద్వారా నెటిజెన్లను కోరింది.

`కరోనా విస్తరిస్తున్న ఈ సమయంలో నా తండ్రి ప్రజల ఆరోగ్యాల రక్షణ కోసం మెడికల్ స్టోర్‌లో పనిచేస్తున్నాడు. నా సోదరుడు పైలెట్‌ గా ఎంతో మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాడు. ఇలా ప్రజా సేవలో ఉన్నవారికి గౌరవం ఇవ్వండి. ప్రజలకు సేవ చేస్తున్న యోధులకు గౌవరం ఇవ్వండి. కరోనా షేమింగ్ చేయ్యోద్దు` ఆమె కోరింది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?