టిక్‌ టాక్ వీడియోపై ఫైర్‌ అయిన యాంకర్‌ అనసూయ

By Satish ReddyFirst Published Apr 18, 2020, 10:12 AM IST
Highlights

తెలుగు యాంకర్‌ అనసూయ మరోసారి తన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ టిక్‌ టాక్‌ వీడియోపై ఆమె తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యింది. ఆ వీడియోను తన పేజ్‌లో షేర్‌ చేసిన అనసూయ వెంటనే అతని టిక్‌ టాక్‌ అకౌంట్‌ ను తొలగించాలని కోరింది.

బుల్లితెర హాట్ బ్యూటీ అనసూయ తన గ్లామర్‌ షోతో ఎంత పాపులర్‌ అయ్యిందో. వివాదాలతోనూ అదే స్థాయిలో వార్తల్లో నిలుస్తుంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తనపై వచ్చే నెగెటివ్‌ కామెంట్స్ విషయంలో ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతుంటుంది అనసూయ. అలాంటి వారిపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకు పడటం అనసూయకు అలవాటు. తాజాగా ఈ భామకు  మరోసారి తన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ టిక్‌ టాక్‌ వీడియోపై ఆమె తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యింది.

ఇద్దరు ఆకతాయిలు రోడ్‌ మీద నడుచుకుంటూ వెళుతూ ఓ అమ్మాయికి డాష్ ఇస్తారు. అయితే వెంటనే ఆ అమ్మాయి తనకు డాష్ ఇచ్చిన అబ్బాయి  చెంప పగలగొడుతుంది. ఆ అబ్బాయి వెంటన ఉన్న యువకుల అతని చేతిలో ఉమ్మి, తరువాత ఆ అబ్బాయి ఆమెకు క్షమాపణ చెబుతున్నట్టుగా షేక్‌ హ్యాండ్ ఇస్తాడు. చేయి తడిగా ఉండటంతో ఆమె అనుమానంగా చూస్తుంది. అప్పుడు ఆ యువకుడు అది ఉమ్మి అని వెటకారంగా నవ్వుతాడు. ఇది ఆ టిక్‌ టాక్‌ వీడియోలో ఉన్న విషయం. ఇలా అమ్మాయిలను అవమానకరంగా చూపించటంపై అనసూయ ఫైర్‌ అయ్యింది.

ఆ వీడియోను తన పేజ్‌లో షేర్‌ చేసిన అనసూయ వెంటనే అతని టిక్‌ టాక్‌ అకౌంట్‌ ను తొలగించాలని ఆమె కోరింది. `ఎవరినీ తప్పు పట్టాలో అర్ధం కావటం లేదు. ఇలాంటి పనులు చేస్తున్నవారినా... లేక వారిని సమర్థించిన వారినా..?  వైరస్ లాంటి ఇలాంటి వ్యక్తులను వెంటనే దండించాలి. ఇలాంటి వారిని జైల్లో పెట్టాలి. అతడి అకౌంట్ తొలగించాలని టిక్‌టాక్‌ ఇండియాను కోరుతున్నా` అంటూ ట్వీట్ చేసింది అనసూయ. అయితే అనసూయ తొలగించాలని కోరిన అకౌంట్‌ను దాదాపు 11 లక్షల మంది ఫాలో అవుతున్నారు. 

I don’t know who to blame.. him or those who follow such an asshole.. yaha hum ghar pe baithre sab chod chadke ke duniya ko is virus se bachaye.. par in jaise virus ka kya karna..This wretch needs to be put behind the bars immediately!!And take down his account first https://t.co/l8KLXmGEIj

— Anasuya Bharadwaj (@anusuyakhasba)
click me!