తూర్పుగోదావరిలో దారుణం: గర్భం దాల్చిన ఇద్దరు బాలికలు, హెడ్‌మాస్టర్ సస్పెండ్

By Siva KodatiFirst Published Mar 18, 2020, 2:57 PM IST
Highlights

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. గిరిజన పాఠశాల విద్యార్ధిని ఒకరు, తుని ఆశ్రమ పాఠశాల విద్యార్ధిని ఒకరు గర్భం దాల్చడం కలకలం రేగింది

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. గిరిజన పాఠశాల విద్యార్ధిని ఒకరు, తుని ఆశ్రమ పాఠశాల విద్యార్ధిని ఒకరు గర్భం దాల్చడం కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే... దారగడ్డ ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్ధిని నీరసంగా ఉండటంతో ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా ఆమె గర్భవతి అని తేలింది.

Also Read:పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను తల్లిని చేశాడు

ఇక మరో ఘటనలో తునిలో పదో తరగతి చదువుతున్న విద్యార్ధిని కూడా గర్భం దాల్చడంతో గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్స్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇటీవల డొంకరాయిలో ఓ విద్యార్ధినిపై వార్డెన్ అత్యాచారం చేయడం, రంపచోడవరం మండలం బూసిగూడెం పాఠశాల విద్యార్ధినిపై అత్యాచారం జరిగిన ఘటనలు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.

ఉన్నతాధికారులెవ్వరూ ఇలాంటివి జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో విఫలం కావడంతో ఐటీడీఏ పీవో నిశాంత్ కుమార్ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను ఆదేశించారు.

Also Read:మహిళ నీచం: నెలల తరబడి గ్యాంగ్ రేప్, గర్భం దాల్చిన బాలిక

దీంతో వై రామవరం మండలం దారగడ్డ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫకీర్‌దొరను ఐటీడీఏ అధికారులు సస్పెండ్ చేశారు. పాఠశాల విద్యార్ధులను కొట్టడం, పలు అవకతవకలకు పాల్పడటం వంటి అభియోగాలపై ఆయనను సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అధికారులు ఈ విషయాన్ని బయటకు రానివ్వడం లేదు. 

click me!