శ్రీశైలంలో అన్యమత ప్రచారం

By telugu teamFirst Published Dec 28, 2019, 10:50 AM IST
Highlights

దేవస్థానం పరిధిలో అన్యమత ప్రచారం చేయటం అన్యమత గ్రంథములు కలిగియుండుట నేరమని తెలిసి కూడా దేవస్థానం నిబంధనలను అతిక్రమించి నట్లయితే చట్టప్రకారం అలా చేస్తే కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు


నిత్యం శివ నామస్మరణతో దేదీప్యమానంగా వెలిగే శ్రీశైలమహాక్షేత్రంలో అన్యమత ప్రచారం జరిగినట్లు గుర్తించి నిన్న సాయంత్రం శ్రీశైలంలోని రుద్రా పార్కు వద్ద నలుగురు క్రైస్తవ మత గ్రంధాలను చదువుకుంటున్న వారిని గుర్తించి వారిని దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 

దేవస్థానం పరిధిలో అన్యమత ప్రచారం చేయటం అన్యమత గ్రంథములు కలిగియుండుట నేరమని తెలిసి కూడా దేవస్థానం నిబంధనలను అతిక్రమించి నట్లయితే చట్టప్రకారం అలా చేస్తే కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.

శ్రీశైలంలోని రుద్ర పార్క్ లో నలుగురు బైబిల్ పఠనం చేస్తూ ఉండడం గమనించిదేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది  అక్కడికి వెళ్లగా బైబిల్ మూసి వేయడంతో అక్కడున్న బ్యాగులను తనిఖీ చేయగా క్రైస్తవ మతం సంబంధించిన పుస్తకాలు లభించినట్లు గుర్తించామని వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని శ్రీశైల దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు తెలిపారు.

click me!