బీమాతో రైతు కుటుంబాల్లో ఆత్మవిశ్వాసం : హరీశ్ రావు

By Siva KodatiFirst Published Sep 26, 2019, 5:19 PM IST
Highlights

రైతు బీమాతో రైతు కుటుంబాల్లో ప్రభుత్వం ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు మంత్రి హరీశ్ రావు. గురువారం సంగారడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్న హరీశ్ మాట్లాడుతూ.. రైతు మరణించిన వారంలోగా బీమా అందించాలని అధికారులను ఆదేశించారు

రైతు బీమాతో రైతు కుటుంబాల్లో ప్రభుత్వం ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు మంత్రి హరీశ్ రావు. గురువారం సంగారడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్న హరీశ్ మాట్లాడుతూ.. రైతు మరణించిన వారంలోగా బీమా అందించాలని అధికారులను ఆదేశించారు.

అలాగే రైతులు ఏ కారణంతో మరణించారో కూడా సమగ్ర సమాచారం సేకరించాలని కోరారు. సమాచారం వుంటే రైతు మరణాలు ఆపడంతో పాటు వారిని కాపాడినట్లు అవుతుందని హరిశ్ అభిప్రాయపడ్డారు.

ఆర్ధిక మాంద్యం ఉన్నా రైతు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు యథాతథంగా నడుస్తాయని మంత్రి స్పష్టం చేశారు. 30 రోజుల ప్రణాళిక సంగారెడ్డి జిల్లాలో ఆదర్శంగా కొనసాగుతూ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుస్తోందన్నారు.

అలాగే ఇక్కడ పల్లె నిద్ర అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో పాటు మెగా శ్రమదానం ద్వారా గ్రామాలలో పారిశుద్ధ్యం ఇతర కార్యక్రమాలు చురుగ్గా సాతుతున్నాయని హరీశ్ రావు తెలిపారు.

ఇదే సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి... మంత్రి హరీశ్‌రావును సన్మానించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. 2014లో హరీశ్ మంత్రిగా ఉన్నప్పుడు తాను ఎమ్మెల్యేగా లేనని.. రెండవసారి ఆయన మంత్రి కావడంతో స్థానిక శాసనసభ్యుడిగా హరీశ్ రావును సన్మానిస్తున్నానని స్పష్టం చేశారు. 

click me!