జ్యోతుల నెహ్రు బుజ్జగింపులు వృధా: వైసీపీలోకి తోట త్రిమూర్తులు

By narsimha lodeFirst Published Sep 13, 2019, 1:30 PM IST
Highlights

మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీని వీడనున్నారు. శుక్రవారం నాడు ఆయన తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన పార్టీ మారే విషయాన్ని ప్రకటించనున్నారు.

రాజమండ్రి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీని వీడనున్నారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు శుక్రవారం నాడు తోట త్రిమూర్తులును కలిశారు.  తన నిర్ణయంలో మార్పు ఉండదని త్రిమూర్తులు జ్యోతుల నెహ్రుకు స్పష్టం చేశారని సమాచారం.

ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ కార్యక్రమాలకు తోట త్రిమూర్తులు దూరంగా ఉంటున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ సమీక్ష సమావేశాలను చంద్రబాబునాయుడు నిర్వహించారు.

ఈ సమావేశాలకు మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు దూరంగా ఉన్నారు. జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని త్రిమూర్తులు ఆరోపణలు చేశారు.శుక్రవారం నాడు మధ్యాహ్నం తోట త్రిమూర్తులు తన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ మారే విషయమై ఈ సమావేశంలో ఆయన ప్రకటన చేయనున్నారు.

మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ఈ విషయమై శుక్రవారం నాడు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తాను పార్టీ మారాలని తీసుకొన్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని తోట త్రిమూర్తులు స్పష్టం చేసినట్టుగా సమాచారం.

ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఇటీవల కాపు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలు కాకినాడలో సమావేశం నిర్వహించడంలో తోట త్రిమూర్తులు కీలకంగా వ్యవహరించారనే ప్రచారం కూడ లేకపోలేదు.

2014 ఎన్నికలకు ముందు తోట త్రిమూర్తులు కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరారు. రామచంద్రాపురం నుండి ఆయన టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో అదే స్థానం నుండి  టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి చేతిలో ఓటమి చెందాడు.

ఎన్నికలకు ముందే తోట త్రిమూర్తులు పార్టీ మారుతారనే ప్రచారం సాగింది. కారణాలుఏవో తెలియదు కానీ ఆయన టీడీపీ అభ్యర్ధిగానే పోటీ చేశారు. టీడీపీని వీడి వైఎస్ఆర్‌సీపీలో చేరాలని  ఆయన నిర్ణయం తీసుకొన్నారని సమాచారం.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు ఝలక్: మురళీమోహన్ కోడలు కూడా.....

టీడీపీకి మరో ఎదురుదెబ్బ: వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు...?

బీజేపీ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి: తేల్చేసిన తోట త్రిమూర్తులు

చంద్రబాబుకు తలనొప్పి: టీడీపీలో ప్రజావేదిక చిచ్చు

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు

టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్

మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ

టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్

ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్

టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి

సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

ఆ నలుగురి బాటలోనే కేశినేని..?

స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

click me!