''ఆవు, కాశ్మీరు, పాకిస్తాన్ కథలతోనే బిజెపికి అధికారం''

By Arun Kumar PFirst Published Oct 10, 2019, 8:17 PM IST
Highlights

బిజెపి పార్టీ ప్రజలను పాకిస్థాన్, కశ్మీర్, ఆవు కథలు చెప్పి ప్రజలను మబ్యపెడుతున్నారని  సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చిగురుపాటి బాబురావు ఆరోపించారు.  

ఆంధ్రప్రదేశ్ లో కేవలం ప్రభుత్వమే మారింది పాలన మాత్రం అలాగే వుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చిగురుపాటి బాబురావు అన్నారు. తెలుగు దేశం, వైఎస్సార్‌సిపి అవే పథకాలను పేర్లు మార్చి కార్యకర్తలకు పంచి పెడుతున్నారని ఆరోపించారు.   

ముఖ్యంగా ఈ రెండు ప్రభుత్వాలు సలహాదారుల పేరుతో లక్షల రూపాయల జీతభత్యాలు ఇచ్చి కొంతమందిని వక్రమార్గం ద్వారా నియమిస్తున్నారన్నారు. పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ల బిల్లులు, అభివృద్ధి పథకాల డబ్బులు, రుణాలు, పనికి ఆహార పథకం డబ్బులు ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ నాయకులు దోచుకుంటున్నారని  ఆరోపించారు.

ఇక ఇసుక కొరత వల్ల లక్షలాది కార్మికుల రోడ్డున పడ్డారని గుర్తుచేశారు. అలాగే ప్రభుత్వానికి వచ్చే లక్షా 40 వేల కోట్ల రూపాయలు రాబోయే నిధులు సక్రమంగా వినియోగించి పేదలకు సక్రమంగా అందేలా చూడాలని అన్నారు.

కేంద్రంలో మోటార్ వాహనాల చట్టం బిల్లు పాస్ చేస్తుంటే వైసీపీ ,టీడీపీ నోరుమెదపడం లేదన్నారు. అలాగే కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు పై కూడా జనసేన తో సహా ఈ రెండు పార్టీలు ఆమోదం తెలిపాయని గుర్తుచేశారు.

దేశంలో సమస్యలు పెరిగిపోతుంటే బిజెపికి ఆవు ,కాశ్మీరు ,పాకిస్తాన్ యుద్ధం, ఆయుధాలు వంటి విషయాలు గుర్తుకు వచ్చి సమస్యను పక్కదారి పట్టిస్తుందన్నారు. ఇవన్నీ అడిగిన మేధావులు నలబై తొమ్మిది మందిపై కేసులు బనాయించి దేశద్రోహం కేసు పెట్టారని అన్నారు. 

దేశంలో ఆర్థిక సంక్షోభం పెచ్చరిల్లి పోయి ఆర్థిక మాంద్యం ఏర్పడి లక్షలాది ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులు అవుతుంటే ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుందని గొప్పలు చెబుతున్నారని బాబురావు అన్నారు.

 రాష్ట్రంలోనూ కార్మిక సమస్యలను పక్కన పట్టించడానికి హిందూ దేవాలయాలు హిందువులే ఉండాలి, బస్సు టికెట్ల మీద హజ్ యాత్ర ,తిరుమల కొండపై యేసు ప్రభు వంటి వివాదాస్పద అంశాలను తెర మీదకు తీసుకు వస్తారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 

 ఈ నెల 16వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో జరుగు ఆర్థిక సంక్షోభం మీద ధర్నాలో ప్రజలంతా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పశ్చిమ కృష్ణ కార్యదర్శి డి.వి కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ హనుమంతరావు, జి.నాగమణి,కె. గోపాల్ శాఖా కార్యదర్శలు,మండల కమిటీ సభ్యులు,  ప్రజాశక్తి భాద్యులు రాజముని,కృష్ణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

click me!