ఆర్టీసీ కార్మికుల తొలగింపు: జిల్లాల యాత్రకు సిద్ధమైన కోమటిరెడ్డి

By Siva KodatiFirst Published Oct 8, 2019, 1:35 PM IST
Highlights

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్‌పై ఫైరయ్యారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సెల్ఫ్ డిస్మిస్ కాదు.. సీఎం సెల్ఫ్ గోల్ వేసుకున్నారని సెటైర్లు వేశారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్‌పై ఫైరయ్యారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సెల్ఫ్ డిస్మిస్ కాదు.. సీఎం సెల్ఫ్ గోల్ వేసుకున్నారని సెటైర్లు వేశారు.

50 వేల మంది కార్మికుల ఉద్యోగాలు పోతే.. తాము ఉండి ఏం లాభమన్న ఆయన రేపటి నుంచి అన్ని జిల్లాల్లో తిరుగుతానని స్పష్టం చేశారు. అధికార పార్టీలో ఉంటేనే హుజూర్‌నగర్‌ను అభివృద్ధి చేస్తారా అని టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.

హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీదే గెలుపని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీపీఐ పొత్తు కోరారంటే టీఆర్ఎస్ ఓటమిని అంగీకరించినట్లేనని ఆయన ధ్వజమెత్తారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ నియంతలా పాలిస్తున్నారని.. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న కార్మికులకు ప్రజలు అండగా ఉండాలని విక్రమార్క పిలుపునిచ్చారు. 

click me!