పల్నాడు హత్యలతో రాజకీయాలా...? : ఏడిజి రవిశంకర్

By Arun Kumar PFirst Published Oct 12, 2019, 2:25 PM IST
Highlights

పల్నాడులో జరిగిన హత్యలకు రాజకీయాలకు ఎలాంటి సంబందం లేదని అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నర్ స్పష్టం చేశారు. 

అమరావతి: పల్నాడులో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని తమకు స్థానికుల నుండి ఫిర్యాదులు అందాయని అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నర్ తెలిపారు.దీంతో  డిజిపి గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు దానిపై పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేశామన్నారు.

పల్నాడులో ఎక్కడ పొలిటికల్ హత్యలు జరుగలేదని... జరిగిన  హత్యలన్నీ ఎలక్షన్స్ ముందు జరిగాయని ఏడిజి తెలిపారు. మంగళగిరిలో టిడిపి నేత హత్య పొలిటికల్ హత్య అంటూ కొందరు ఫిర్యాదు చేశారు. మంగళగిరి హత్యలో పొలిటికల్ ఇన్వాల్మెంట్ లేదన్నారు. వ్యక్తి గత కక్షలే ఈ హత్యలకు కారణమని ఆయన వివరించారు. 

కొందరు కావాలనే చలో ఆత్మకూరు అనే పుస్తకం పేరుతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. 38 కేసులలో 4 కేసులు మాత్రమే వాస్తవమైనవని...మిగతావన్నీ తప్పుడు ఫిర్యాదులుగా తేలాయి. 

అలజడుల కారణంగా కొందరు ప్రజలు ఊర్లు వదిలిపెట్టి పారిపోయారు అని ప్రచారం చేస్తున్నారు. వారు వ్యక్తి గత కారణాలు,అవసరాల దృష్ట్యా పల్నాడు వదిలిపెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది. పల్నాడు ప్రాంతాన్ని వదిలి వెళ్ళిన విషయంలో ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్మెంట్స్ లేదని ఏడిజి తెలిపారు. 

కేవలం 33 మంది మాత్రమే పల్నాడు వదిలి పెట్టినట్లు తేలింది. వారి స్టేట్మెంట్ ను కూడా రికార్డు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలు తమపై దాడుల జరిగాయంటూ  డిజిపికి ఫిర్యాదు చేశారు. ఇలా మొత్తం 126 కేసులలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు  ఏడిజి వెల్లడించారు.

click me!