పాక్‌ చేతిలో భారత్ ఓటమి: కోహ్లీ కూతురిని రేప్ చేస్తానన్న దుండగుడి అరెస్ట్.. నిందితుడు హైదరాబాద్‌లో టెక్కీ

By Siva KodatiFirst Published Nov 10, 2021, 4:58 PM IST
Highlights

టీమిండియా (team india) కెప్టెన్ విరాట్ కోహ్లీని (virat kohli) బెదిరించిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.  పాకిస్థాన్‌తో (India vs pakistan) ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో (t 20 world cup) భారత్ జట్టు ఓడిపోగా.. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. మరీ ముఖ్యంగా.. కోహ్లీ 9 నెలల కుమార్తెని రేప్ చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి

టీమిండియా (team india) కెప్టెన్ విరాట్ కోహ్లీని (virat kohli) బెదిరించిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోహ్లీ కుమార్తెపై (kohli daughter) అత్యాచారం చేస్తానంటూ నిందితుడు కొద్దిరోజులు క్రితం బెదిరింపులకు పాల్పడ్డాడు. నిందితుడు హైదరాబాద్ వాసి రామ్‌నగేశ్‌ను (ram nagesh) అరెస్ట్ చేసిన అనంతరం పోలీసులు ముంబైకి తరలించారు. అతను నగరంలోని ఓ ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

పాకిస్థాన్‌తో (India vs pakistan) ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో (t 20 world cup) భారత్ జట్టు ఓడిపోగా.. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో కోహ్లీ ఫ్యామిలీకి కూడా ఆన్‌లైన్‌లో బెదిరింపులు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. మరీ ముఖ్యంగా.. కోహ్లీ 9 నెలల కుమార్తెని రేప్ చేస్తామంటూ కొందరు బెదిరించడంపై ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) (delhi women commission) సీరియస్ అయ్యింది.

ALso Read:టీమిండియాలో గ్రూపులు.. అందుకే కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.. పాక్ మాజీ క్రికెటర్..!

కోహ్లీ కుటుంబానికి బెదిరింపులపై వచ్చిన వార్తల్ని సుమోటోగా తీసుకున్న డీసీడబ్ల్యూ.. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్)‌కి నోటీసులు జారీ చేసింది. ఈ బెదిరింపులకి సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీ, అరెస్ట్ చేసిన నిందితుల వివరాల్ని తమకి ఇవ్వాలని డీసీడబ్ల్యూ ఆ నోటీసులో పేర్కొంది. పాకిస్థాన్‌తో ఓటమి తర్వాత టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై (mohammed shami) కొంత మంది నెటిజన్లు మతపరమైన దాడికి దిగగా.. షమీకి విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు. దాంతో.. కోహ్లీ ఫ్యామిలీపై బెదిరింపులు మరింత పెరిగినట్లు తేలింది.

టీ20 వరల్డ్‌కప్ ఫస్ట్ మ్యాచ్‌లోనే పాకిస్థాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన టీమిండియా.. ఆ తర్వాత న్యూజిలాండ్ చేతిలోనూ 8 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. అయితే ఆ తర్వాత పుంజుకున్న భారత్.. వరుసగా ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాలపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికి తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమితో టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

click me!