ఆసియా కప్ ఫైనల్ లో శ్రీలంకను మట్టికరిపించి రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది. ట్రోఫీని లిఫ్ట్ చేయడంలో తిలక్ వర్మకు అరుదైన అవకాశం దక్కింది.
కొలంబో: హైదరాబాదీ తిలక్ వర్మకు అరుదైన అవకాశం లభించింది. ఆసియా కప్ ట్రోఫీని తొలుత లిఫ్ట్ చేసే అవకాశం తిలక్ వర్మకు లభించింది. భారత జట్టు సభ్యుల్లో పలువురు ట్రోఫీని లిఫ్ట్ చేశారు. అయితే, తొలుత ట్రోఫీని పైకెత్తే అవకాశం మాత్రం తిలక్ వర్మకు లభించింది. అతి చిన్న లేదా జట్టులోని కొత్త సభ్యుడికి తొలుత ట్రోఫీని లిఫ్ట్ చేసే సంప్రదాయం టీమిండియా విషయంలో కొనసాగుతూ వస్తోంది.
ఆ తర్వాత కూడా ట్రోఫీని లిఫ్ద్ చేసినవారిలో ఆటగాడు గానీ, కోచ్ లేదా ఫిజియో గానీ లేరు. తిలక్ వర్మ తర్వాత ట్రోఫీని లిఫ్ట్ చేసే అవకాశం భారత స్క్వాడ్ లోని రఘు రాఘవేంద్రకు లభించింది. అతను త్రో డౌన్ స్పెషలిస్టు. అతని పాటు టీమిండియా బలగంలో మరో ఇద్దరు త్రో డౌన్ స్పెషలిస్టులు కూడా ఉన్నారు.
undefined
త్రో డౌన్ స్పెషలిస్టులకు ఎంతో క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుందని, తమకు వాళ్లు ఎంతో ప్రాక్టీస్ ఇచ్చారని, వారి సేవలు అమేయమైనవని, వారి పేర్లను, ముఖాలను గుర్తించాల్సి ఉంటుందని, తమ విజయంలో వారి పాత్ర ఎంతో ఉందని అని విరాట్ కోహ్లీ అంతకు ముందు అన్నాడు.భారత తొలి త్రో డౌన్ స్పెషలిస్టు రాఘవేంద్ర. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీలకు కూడా అతను త్రో డౌన్ స్పెషలిస్టుగా వ్యవహరించాడు.
ఆసియా కప్ ఫైనల్ లో శ్రీలంక బ్యాటింగ్ ను మొహమ్మద్ సిరాజ్ తుత్తినయలు చేశాడు. సిరాజ్ ధాటికి తట్టుకోలేని శ్రీలంక బ్యాటర్లు 50 పరుగులకే చేతులెత్తేశారు. సిరాజ్ ఏడు ఓవర్లు వేసి 21 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు. భారత్ 51 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా 6.1 ఓవర్లలో ఛేదించి ట్రోఫీని సొంతం చేసుకుంది.
ఫాస్ట్ బౌలర్ల అద్భుతమైన ప్రదర్శన తనకెంతో ఆనందాన్నిచ్చిందని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తాను సిరాజ్ తో పది ఓవర్లు వేయిద్దామని అనుకున్నానని, అయితే ట్రైనర్ ఆపాడని ఆయన చెప్పారు. స్లిప్ లో నించుని సిరాజ్ బౌలింగ్ చూడడం ఎంతో సంతోషదాయకమైన విషయమని అన్యనాడు. ఇతర ఇద్దరు బౌలర్ల కన్నా సిరాజ్ కాస్తా ఎక్కువగా బంతిని మూవ్ చేశాడని చెప్పాడు.