వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మల్టీ నేషనల్ కంపెనీలకు జీఎస్టీ అధికారులు టాక్స్ నోటీసులు పంపారు. విదేశీ ఉద్యోగులకు చెల్లించే జీతాలు, అలవెన్సులపై 18 శాతం చొప్పున పన్ను చెల్లించాలని ఆయా కంపెనీలను GST విభాగం కోరింది. సుమారు 1000 కంపెనీలకు ఈ నోటీసులు అందినట్లు సమాచారం.
దాదాపు వెయ్యికి పైగా మల్టీ నేషనల్ కంపెనీల భారతీయ యూనిట్లకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికారులు పన్ను నోటీసులు పంపారు. తమ విదేశీ ప్రమోటర్లు 'విదేశీ అధికారులకు' చెల్లించే జీతాలు, అలవెన్సులపై 18 శాతం చొప్పున పన్ను చెల్లించాలని ఈ కంపెనీలను GST విభాగం కోరింది. ఇటీవలి వారాల్లో, GST విభాగం 2018 నుండి 2022 మధ్య కాలంలో ప్రతి మల్టీ నేషనల్ కంపెనీకి రూ.1 కోటి నుండి రూ. 150 కోట్ల వరకు పన్ను నోటీసులను పంపింది. మల్టీ నేషనల్ కంపెనీల భారతీయ యూనిట్లలో పనిచేస్తున్న విదేశీ ఎగ్జిక్యూటివ్‌లకు విదేశీ ప్రమోటర్లు చేసే చెల్లింపులపై జిఎస్‌టి ఉంటుందని ఈ విషయంపై అవగాహన ఉన్న అధికారి ఒకరు మీడియాతో తెలిపారు. మల్టీ నేషనల్ కంపెనీల స్థానిక యూనిట్ల ఆడిట్ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పారు.
వీటిలో స్మార్ట్‌ఫోన్‌లు, వాహనాలు, సాఫ్ట్‌వేర్, FMCG, సౌందర్య సాధనాలు మొదలైన రంగాలకు చెందిన కంపెనీలు ఉన్నాయి. సదరు అధికారి మాట్లాడుతూ, 'ఇటువంటి చాలా కేసులలో, 2018 ఆర్థిక సంవత్సరంలో చేసిన చెల్లింపులకు నోటీసులు పంపబడ్డాయి. అయితే, FY 19, 20, 21 , 22కి కూడా పన్ను నోటీసులు జారీ చేయబడ్డాయి. పన్ను డిమాండ్‌పై స్పందించేందుకు కంపెనీలకు 30 రోజుల గడువు ఇచ్చారు.
నార్తర్న్ ఆపరేటింగ్ సిస్టమ్ (NOS) కేసులో మే 2022లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మల్టీ నేషనల్ కంపెనీల అనుబంధ సంస్థలపై పన్ను డిమాండ్ల కేసులను పెంచింది. భారతీయ సంస్థకు విదేశీ గ్రూపు ఉద్యోగులను డిప్యూటేషన్ చేయడం మానవ వనరుల సరఫరా పరిధిలోకి వస్తుందని, దీనిపై రివర్స్ ఛార్జ్ విధానంలో భారతీయ సంస్థ జీఎస్టీ పన్ను చెల్లించాల్సి ఉంటుందని కోర్టు తీర్పులో పేర్కొంది.
ఈ నిర్ణయం సేవా పన్నుకు సంబంధించినది (GSTకి ముందు కాలంలో) కానీ GSTలో కూడా అంతర్లీనంగా ఉంది. విదేశీ ఉద్యోగులు డిప్యూటేషన్ ద్వారా పని చేయడం, విదేశాల్లో జీతాలు చెల్లించడం అనేది పరిశ్రమలో ఒక సాధారణ పద్ధతి , ఇప్పటికీ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇండస్ట్రీ అభిప్రాయాలు విడిపోయాయి. కొన్ని కంపెనీలు GST చెల్లించడం ద్వారా క్రెడిట్‌ను క్లెయిమ్ చేశాయి. అయితే వడ్డీకి సంబంధించిన అంశం న్యాయపరమైన పరిశీలనలో ఉంది. కొన్ని కంపెనీలు పన్ను చెల్లించలేదని, ఎన్‌ఓఎస్ ఇష్యూకు అతీతంగా ఉన్నాయని పేర్కొంటూ న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాయి.
KPMGలో భాగస్వామి, రోక్ష పన్నుల అధిపతి అభిషేక్ జైన్ మాట్లాడుతూ, “NOS కేసులో కోర్టు నిర్ణయం ఆధారంగా, రెవెన్యూ శాఖ అనేక కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భారతదేశానికి పంపిన విదేశీ అధికారుల జీతాలు చెల్లించమని కోరింది. అలవెన్సుల చెల్లింపుపై జీఎస్టీ చెల్లించాలని కోరడం జరిగింది.’ అని పేర్కొన్నారు.