కేంద్ర బడ్జెట్ లో మంత్రి స్వీట్ స్టోరీ

By telugu teamFirst Published Jul 5, 2019, 3:04 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా... ఈ బడ్జెట్ ప్రసంగం చదివే సమయంలో.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓ స్వీట్ స్టోరీ వినిపించారు. 

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా... ఈ బడ్జెట్ ప్రసంగం చదివే సమయంలో.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓ స్వీట్ స్టోరీ వినిపించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల సహకారంపై ఆమె ప్రశంసలు కురిపించారు. ప్రత్యేకించి గ్రామీణ రంగంలోని మహిళల పాత్ర ఓ స్వీట్ స్టోరీలాంటిదని ఆమె అభివర్ణించారు.

ప్రతి స్వయం సహాయక బృందంలో ఓ మహిళకు ముద్ర పథకం కింద రూ.1 లక్ష వరకు రుణం తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ‘‘నారీ తూ నారాయణి’ (మహిళలే శక్తి స్వరూపాలు) అనే మాట భారత మహిళలకు సరిగ్గా సరిపోతుంది. మహిళల భాగస్వామ్యంతోనే ప్రగతి సాధ్యమని ఈ ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. భారత అభివృద్ధి గాథలో, ప్రత్యేకించి గ్రామీణ ఆర్ధిక రంగంలో మహిళల పాత్ర చాలా ‘మధురమైన కథ’...’’ అని సీతారామన్ పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో పురుషులతో సమానంగా స్త్రీలు సమానంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆమె తెలిపారు. పార్లమెంట్ లో కూడా రికార్డు స్థాయిలో 78మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. 

related news

కేంద్ర బడ్జెట్ 2019: రైల్వేలో ప్రైవేట్ పెట్టుబడులకు ఊతం

కేంద్ర బడ్జెట్ 2019: 114 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణం

కేంద్ర బడ్జెట్ 2019: కేసీఆర్ మిషన్ భగీరథ తరహలో స్కీమ్

కేంద్ర బడ్జెట్ 2019: షాప్ కీపర్స్‌కు నిర్మల శుభవార్త

కేంద్ర బడ్జెట్‌ 2019: ఒకే దేశం ఒకే పవర్ గ్రిడ్

కేంద్ర బడ్జెట్ 2019: జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు

నిర్మల సీతారామన్ బడ్జెట్ 2019: పార్లమెంట్‌కు వచ్చిన తల్లిదండ్రులు
కేంద్ర బడ్జెట్ 2019: నిర్మల సీతారామన్ రికార్డు

click me!