కేంద్ర బడ్జెట్... పాన్ తో పనిలేదు.. ఇక ‘ఆధార్’ ఆధారం

By telugu teamFirst Published Jul 5, 2019, 2:01 PM IST
Highlights


కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. కాగా ఈ బడ్జెట్ ద్వారా పాన్ కార్డ్ లేని వారికోసం ఓ వెసులుబాటు తీసుకువచ్చారు.

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. కాగా ఈ బడ్జెట్ ద్వారా పాన్ కార్డ్ లేని వారికోసం ఓ వెసులుబాటు తీసుకువచ్చారు.  పాన్ కార్డు, ఆధార్ కార్డ్ లను పరస్పరం వినియోగించుకునేలా వెసులుబాటు తీసుకువచ్చారు. పాన్ కార్డ్ లేకున్నా.. కేవలం ఆధార్ కార్డ్ ని వినియోగించుకోవచ్చని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

మనదేశంలో దాదాపు 120కోట్ల మందికి పైగా భారతీయులకు ఆధార్ కార్డు ఉన్నట్లు నిర్మలాసీతారమన్ తెలిపారు. అందుకే పాన్-ఆధార్ నెంబర్లను పరస్పరం మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.

  ఏదైనా వెరిఫికేషన్ సమయంలో పాన్ కార్డు లేకపోతే ఆధార్ నెంబర్‌ను, ఆధార్ కార్డు లేకపోతే పాన్ నెంబర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ రెండింటిని పరస్పరం వినియోగించుకోవచ్చన్నమాట.  ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఇప్పటివరకు పాన్ కార్డు తప్పనిసరి.  అయితే ఇకపై పాన్ కార్డు లేనివాళ్లు తమ ఆధార్ నెంబర్‌తో ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయొచ్చని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది కొంత వరకు ఉపయోగకరమైనదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

click me!