కాలగర్భంలోకి 132 ఏళ్ల చరిత్ర.. బ్రిటీష్ కాలం నాటి మిలటరీ డెయిరీలు మూసివేత

By Siva KodatiFirst Published Apr 1, 2021, 4:37 PM IST
Highlights

బ్రిటీష్ కాలం నాటి మిలటరీ ఫామ్‌కు చరమగీతం పాడేసింది. సైనిక సంస్కరణలలో భాగంగా వీటిని మూసివేసినట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో 132 ఏళ్ల చరిత్ర కలిగిన పాల ఉత్పత్తి కేంద్రాలు కాలగర్భంలో కలిసిపోయాయి. 

ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించి పెద్దఎత్తున నిధులు సమీకరించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిరిండియా సహా దేశంలోని పలు పీఎస్‌యూలను ప్రైవేటీకరణ చేస్తోంది.

తాజాగా బ్రిటీష్ కాలం నాటి మిలటరీ ఫామ్‌కు చరమగీతం పాడేసింది. సైనిక సంస్కరణలలో భాగంగా వీటిని మూసివేసినట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో 132 ఏళ్ల చరిత్ర కలిగిన పాల ఉత్పత్తి కేంద్రాలు కాలగర్భంలో కలిసిపోయాయి. 

బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ తమ సైనిక బలగాలలోని గుర్రాలు, ఒంటెలుసహా ఇతర జంతువుల సంరక్షణ కోసం 1794లో రిమౌంట్, వెటర్నరీ ఫార్మ్స్‌ సర్వీసెస్‌ ప్రారంభించింది.

సైనికులకు స్వచ్ఛమైన, నాణ్యమైన పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు అందించేందుకు ప్రత్యేకంగా మిలటరీ ఫార్మ్స్‌ సర్వీసెస్‌ పేరిట దేశవ్యాప్తంగా 39 మిలటరీ డెయిరీఫామ్‌లు ఏర్పాటు చేసింది. భారత్‌లో మొదటి మిలటరీ ఫామ్‌ 1889 ఫిబ్రవరి 1న అలహాబాద్‌లో ప్రారంభమయ్యింది. 

దేశవ్యాప్తంగా పలు కంటోన్మెంట్లలో మిలటరీ ఫామ్స్‌ ఉన్నాయి. వీటిలో 25 వేల ఆవులు/గేదెలు ఉన్నట్లు అంచనా. ఇవి ప్రతిరోజూ వేలాది లీటర్ల పాలు ఇచ్చేవి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి 130 ఫామ్‌లు, 30 వేల ఆవులు/గేదెలు ఉన్నాయి.

ఈ మిల్క్‌ ఫామ్స్‌ నిర్వహణ కోసం సైన్యం ప్రతిఏటా రూ.300 కోట్లు ఖర్చు చేసేది. ఫామ్స్‌ను మూసివేయడంతో వీటిలో ఉన్న ఆవులు, గేదెలను ప్రభుత్వ విభాగాలకు, డెయిరీ సహకార సంఘాలకు స్వల్ప ధరకే విక్రయించాలని సైన్యం నిర్ణయించింది. 

click me!