మీనరాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

By ramya neerukondaFirst Published Sep 4, 2018, 3:39 PM IST
Highlights

నిలకడ అనేది ఉండదు. చాలా భయపడతూ ఉంటారు. కవితా రచన అంటే ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు.

చేతులు పాదాలు కొంచెం పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది ఉండదు. చాలా భయపడతూ ఉంటారు. కవితా రచన అంటే ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి తోచదు. వీరు ఎదైనా పనిచేయాలంటే తోడు ఉండాల్సిందే. ఒక్కరూ స్వతంత్రంగా చేయలేరు. మొదలు పెట్టిన పనిని కూడా పూర్తి చేసేవరకు నమ్మకం ఉండదు. మానసిక ఆందోళనలు చాలా ఉండాయి. పనులు ఎంత వేగంగా చేయాలనే ఆలోచన ఉంటుందో అంతే వేగంగా తమ నిర్ణయాలను కూడా మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయాలనైనా లోతుగా పరిశీలించే తత్త్వం ఉండదు. పైపైన చూసి నిర్ణయాలు తీసుకుంటారు.

 

వీరికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను నిర్వహించలేరు. తొందరగా అలసిపోతారు. మీనరాశిలో పాప గ్రహాలు ఉండి మీనం సహజ ద్వాదశభావం అయితే వారి ఆలోచనలు ఈ విధంగా మారుతూ ఉంటాయి. అన్నిటిలోనూ ఇబ్బందిని పడుతూ ఉంటారు. ఉదా : నిద్ర నాకు సరిగా పట్టటం లేదు - ఎక్కువగా ఆసుపత్రులను చూడాల్సి వస్తుంది - ప్రయాణాల్లో సమస్యలుంటున్నాయి - సౌఖ్యం లేదు - సంపాదించినదంతా ఏదో రూపంలో ఖర్చులు అవుతున్నాయి - పొందినది ఏదీ మిగలడం లేదు మొదలైన సమస్యలు వ్యయ భావలోపాలకు సంబంధించిన సాధారణ ప్రశ్నలు.

 

వ్యయాధిపతి వ్యయంలో ఉన్న అధిక వ్యయం, అనారోగ్యం, కష్టనష్టాలు, అనేక దుఃఖాలు కలుగును.

 

వ్యయాధిపతికి లగ్నాధిపతితో సంబంధం ఉన్నా, వ్యయాధిపతి లగ్నంలో ఉన్నా, వ్యయంలో షష్ఠ అష్టమాధిపతులున్నా, వ్యయాధిపతి షష్ఠాష్టమాలలో ఉన్నా (విపరీత రాజయోగం), సర్వాష్టక వర్గులో లాభం కన్నా వ్యయం ఎక్కువగా ఉన్నా, అతి తక్కువగా ఉన్నా వ్యయ భావానికి సంబంధించిన లోపాలుగా గమనించాల్సి ఉంటుంది.

 

కాలాన్ని ధనాన్ని వ్యర్థం చేయడం, తద్వారా ఇతరులకు మానసిన వేదనను కలిగించడం, ఇతరులకు అనారోగ్యం కలగడానికి ప్రత్యక్ష పరోక్ష పాత్ర వహించడం, ఎవరికీ దాన ధర్మాలు చేయకపోవడం, అందరినీ నిందించడం, తన చుట్టూ ఉన్న ఎవ్వరికీ సుఖం లేకుండా చేయడం, సంతోష పడకుండా అడ్డుపడడం వంటి పూర్వకర్మల వల్ల వ్యయభావలోపాలకు అవకాశముంది.

 

నిరంతరం దానధర్మాలు చేస్తూ ఉండడం, తనకున్న దానిలో ఇతరులకు సహకరించడం, శరీరంతో సేవ, పరోపకారాలు చేయడం, అవకాశమున్నంత వరకు మరికొందరు సుఖపడేందుకు తన వంతు ఆహారాదులు అందించి సహకరించడం, అనారోగ్య నివారణలకు తగిన ధనధాన్యాదులను అందించడం, ప్రత్యక్షంగా పరోక్షంగా ఇతరులకు సేవ చేస్తూ ఉండడం వల్ల పూర్వకర్మలోపం వల్ల కలిగే వ్యయభావ లోపాలను నివారించుకునే అవకాశం ఉంటుంది.

 

ఈ లోకంలో నష్టమనేది లేదు, ఈ దేహంలోని పరమాత్మ కూడా పూర్ణుడైనవాడే, కోల్పోవడం అనేది ఏమీ లేదు, ఒకటి కోల్పోవడమంటే మరొకటి పొందడమే, వదులుకునేవి వదిలినప్పుడే నిత్య చైతన్యం, పురోగతి ఏర్పడుతుంది, వ్యర్థ పదార్థాలు ఎప్పటికీ వదిలి పెట్టాల్సిందే వంటి భావనలను పొందడం ద్వారా వ్యయ భావలోపాలకు తగిన పరిష్కారం లభిస్తుంది. 

 

ఈ విధంగా ఎవరికి వారు తమ లక్షణాలను తెలుసుకుని లోపాలను సవరించుకుంటూ గుణాలను ఇంకా వృద్ధి చేసుకుంటూ పరోపకారమైన పనులు చేస్తూ తమలో ఉండే దోషాలను తొలగించుకుని హాయిగా, ఆనందమయమైన జీవితాన్ని గడపాలి.

 

డా.ప్రతిభ

ఇవి కూడా చదవండి

కుంభ రాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

మకర రాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

ధనస్సు రాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

వృశ్చికరాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

తుల రాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

కన్య రాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

జ్యోతిష్యం.. సింహ రాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. కర్కాటక రాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. మిథునరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. వృషభరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

‘మేషరాశి’ వాళ్ల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

click me!