సీఈసీతో ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అనిల్ పునీఠ భేటీ

By narsimha lodeFirst Published Apr 1, 2019, 2:39 PM IST
Highlights

ఇంటలిజెన్స్  డీజీగా  ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ విషయంలో ఏపీ  ప్రభుత్వం జారీ చేసిన జీవోల విషయంలో  సీఈసీ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ పునేఠాను  వివరణ కోరింది.   

న్యూఢిల్లీ: ఇంటలిజెన్స్  డీజీగా  ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ విషయంలో ఏపీ  ప్రభుత్వం జారీ చేసిన జీవోల విషయంలో  సీఈసీ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ పునేఠాను  వివరణ కోరింది.   

సోమవారం నాడు  సీఈసీ సునీల్ ఆరోరాతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ పునేఠ  భేటీ అయ్యారు. వారం రోజుల క్రితం వైసీపీ ఫిర్యాదు మేరకు ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు రాహుల్ దేవ్ శర్మ, వెంకటరత్నంలను బదిలీ చేస్తూ సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల విధులతో ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ ప్రభుత్వం వాదించింది.ఈ మేరకు 720, 721 జీవోలను జారీ చేసింది.

హైకోర్టు తీర్పు తర్వాత  ఇంటిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును  పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు ఏపీ సర్కార్ బదిలీ చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్‌పై సీఈసీ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ పునేఠను వివరణ కోరింది. సీఈసీతో భేటీ తర్వాత అనిల్ పునేఠ ముభావంగా వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

దిగొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం: ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ

ఐపీఎస్‌ల బదిలీ: చంద్రబాబు సర్కార్‌కు హైకోర్టులోషాక్

ఐపీఎస్‌ల బదిలీలపై హైకోర్టు తీర్పు రిజర్వ్

ఐపీఎస్‌ల బదిలీలు: హైకోర్టులో రేపు వాదనలు

కీలక జీవోను జారీ చేసిన చంద్రబాబు సర్కార్:ఇంటలిజెన్స్‌కి మినహాయింపు

మేమే చెప్పాం, అందుకే ఇంటలిజెన్స్ డీజీ బదిలీ: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి

ఎన్టీఆర్‌తో పెట్టుకొంటే ఇందిరా ఏమయ్యారో తెలుసు కదా: కోడెల

నేరస్తుడి ఫిర్యాదుతో ఐపీఎస్‌లను బదిలీ చేస్తారా: చంద్రబాబు ఈసీ‌పై మండిపాటు

ఐపీఎస్‌ల బదిలీలు: హైకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్

ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు: ఈసీపై చంద్రబాబు సీరియస్

click me!