రాయలసీమలో జనసేన జీరో, అనంత మాదే: ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి

Published : Apr 01, 2019, 01:03 PM IST
రాయలసీమలో జనసేన జీరో, అనంత మాదే: ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి

సారాంశం

రాయలసీమలో ఏ ఒక్కసీటు కూడా గెలుచుకోలేదని స్పష్టం చేశారు. మిగిలిన జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో తనకు తెలియదన్నారు జేసీ. అయితే అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి తన కుమారుడు జేసీ పవన్ రెడ్డి, తాడిపత్రి నియోకజకవర్గం నుంచి తన సోదరుడి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించడం తథ్యమన్నారు. 


అనంతపురం: రాయలసీమ జిల్లాలలో జనసేన పార్టీ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాయలసీమలో ఏ ఒక్కసీటు కూడా గెలుచుకోలేదని స్పష్టం చేశారు. 

మిగిలిన జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో తనకు తెలియదన్నారు జేసీ. అయితే అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి తన కుమారుడు జేసీ పవన్ రెడ్డి, తాడిపత్రి నియోకజకవర్గం నుంచి తన సోదరుడి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించడం తథ్యమన్నారు. 

రాయలసీమకు నీళ్లు రావాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడే సీఎం కావాలని కోరారు. ఇప్పటికే రాయలసీమకు నీళ్లు తీసుకు వచ్చిన చంద్రబాబుకు మరోసారి అవకాశం ఇస్తే రాయలసీమలో కరువు ఉండదన్నారు జేసీ దివాకర్ రెడ్డి. 
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు