అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

By Nagaraju TFirst Published Oct 30, 2018, 2:48 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు  ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌తో అడ్డదిడ్డమైన మాటాలు మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌పై ఆయన కుటుంబ సభ్యులే హత్యాయత్నం చేశారని చెప్పడం దురదృష్టకమరన్నారు. 

ఢిల్లీ : తెలుగుదేశం పార్టీపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు  ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌తో అడ్డదిడ్డమైన మాటాలు మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌పై ఆయన కుటుంబ సభ్యులే హత్యాయత్నం చేశారని చెప్పడం దురదృష్టకమరన్నారు. 

అలిపిరిలో దాడి మావోయిస్టులు చేసింది కాదు, భువనేశ్వరి చేయించారని ఎవరైనా అంటే ఒప్పకుంటారా? అని ప్రశ్నించారు. అలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయాల్సిన ఖర్మ మాకు లేదు అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

ఢిల్లీలో పర్యటిస్తున్న వైసీపీ నేతల బృందం మంగళవారం మీడియాతో మాట్లాడింది. పక్కా పథకం ప్రకారమే జగన్‌పై హత్యాయత్నం జరిగిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ కుట్రలో చంద్రబాబు, లోకేశ్‌, హర్షవర్దన్, సినీనటుడు శివాజీలు భాగస్వాములన్నారు. జగన్‌పై జరిగిన హత్యాయత్న ఘటనపై ఏపీ డీజీపీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతకరంగా ఉన్నాయన్నారు.

అలిపిరిలో చంద్రబాబు గాయపడితే హుటాహుటిన ఆనాటి సీఎం వైఎస్ ఆర్ తిరుపతికి వెళ్లి పరామర్శించారని గుర్తు చేశారు. చంద్రబాబుపై దాడికి నిరసనగా వైఎస్ఆర్ ధర్నా చేశారని తెలిపారు. కానీ చంద్రబాబు మాత్రం జగన్‌పై జరిగిన హత్యాయత్న సంఘటనను తక్కువ చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

ఒక ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే అంతా ఖండిస్తారని అలాంటిది జగన్ పై హత్యాయత్నాన్ని ఖండించిన నేతలను టీడీపీ తప్పుబడుతుందని ఎద్దేవా చేశారు. గవర్నర్‌ను కూడా తప్పుబట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేసుకు సంబంధించిన పూర్వాపరాలు తెలుసుకోకుండానే నిందితుల గురించి డీజీపీ చెప్పడం దారుణమన్నారు. ఏపీ పోలీసు శాఖ ప్రభుత్వానికి కొమ్ముకాస్తుందని ధ్వజమెత్తారు. వాస్తవాలు బయటకు రావాలంటే థర్డ పార్టీ విచారణ జరగాల్సిందేనని ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. 

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం పాపులారిటీ కోసమే చేశారని డీజీపీ చెప్పడం దారుణమని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. డీజీపీ ప్రకటన విచారణను నీరుగార్చేలా ఉందని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ అప్రమత్తంగా ఉండటం వల్లే ప్రాణపాయం తప్పిందన్నారు.

జగన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే సీఎం, మంత్రులు బాధ‍్యతారాహిత్యమైన ప్రకటనలు చేశారని విమర్శించారు. టీడీపీ నేతల ప్రోద్బలంతోనే శ్రీనివాస్‌ హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ నేతల అండలేకుంటే క్రిమినల్‌ కేసులున్న శ్రీనివాస్‌కి ఎన్‌వోసీ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. 

క్యాంటీన్‌ యజమాని హర్షవర్దన్‌ సీఎం చంద్రబాబు, లోకేశ్‌లకు సన్నిహితుడని ఆరోపించారు. వాస్తవాలు బయటకు రావాలంటే కేంద్ర సంస్థలతోనే దర్యాప్తు చేయించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు.
 
వైఎస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే టీడీపీ కుట్ర చేసి హత్యాయత్నానికి పాల్పడిందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి ఆరోపించారు. సరైన విచారణ జరిగితేనే నిజాలు బయటకొస్తాయన్నారు. పాత్రధారుడిపైనే కాదు సూత్రధారులపైనా విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. 
 
జగన్‌పై హత్యాయత్నం జరిగిందని పోలీస్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో స్పష్టంగా ఉన్నా సీఎం చంద్రబాబు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మాజీఎంపీ వరప్రసాద్ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే ప్రభుత్వం, డీజీపీ దాన్ని చిన్నదిగా చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. 

చంద్రబాబుపై దాడి జరిగితే వైఎస్సార్‌ హుందాగా వ్యవహరించారని గుర్తుచేశారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర సంస్థలచే విచారణ చేయిస్తే నిజాలు బటయకొస్తాయని వరప్రసాద్‌ పేర్కొన్నారు.
 

ఈ వార్తలు కూడా చదవండి

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

మేం ఒంటరికాదు...పవన్ మాతోనే: సీపీఎం మధు

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ

జగన్ కి షాక్.. టీడీపీలోకి వైసీపీ సీనియర్..?

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

click me!