ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ బిల్లును మండలిలో గట్టెక్కకుంటే ఏం చేయాలనే దానిపై ప్రత్యామ్నాయాలను వెతుకుతోంది.
అమరావతి: శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదంపై ఏపీ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. శాసనమండలిలో ఈ బిల్లు ఆమోదం పొందకపోతే ప్రత్యామ్నాయాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
Also read:మండలి రద్దుకు జగన్ కసరత్తు: అసెంబ్లీలో తీర్మానం?
ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ బిల్లును ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లుపై చర్చ రాకుండా టీడీపీ సభ్యులు 71 రూల్ కింద నోటీసును ఇచ్చారు.
also read: ఢిల్లీకి పవన్ కళ్యాణ్: బీజేపీ, జనసేన నేతల కీలక భేటీ
Also read:అందుకే టీడీపీ ఒక్క స్థానంలోనే గెలిచింది: అసెంబ్లీలో జగన్
Also read:జగన్‌కు షాక్: మండలిలో టీడీపీ నోటీసుపై చర్చకు అనుమతి
Also read:బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ
Also read:ఏపీ అసెంబ్లీలో టీడీపీ నిరసన: హెడ్‌సెట్ తీసేసి కోపంగా వెళ్లిన స్పీకర్ తమ్మినేని
ఈ నోటీసుపై చర్చకు ఏపీ రాష్ట్ర శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ అవకాశం కల్పించారు. ఈ విషయమై మంత్రులు శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ తీరుపై మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా ఛైర్మెన్ వ్యవహరించాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఛైర్మెన్ షరీప్ కు సూచించారు.
శాసనమండలిని రద్దు చేయవద్దని వైసీపీకి చెందిన కొందరు నేతలు చెబుతున్నారు. శాసనమండలి రద్దు చేయకుండా ఆర్డినెన్స్ తీసుకురావాలని కొందరు వైసీపీ నేతలు సూచిస్తున్నారు.
also read:మండలిలో బిల్లు: 71 కింద చర్చకు పట్టు, టీడీపీ సభ్యుల గైర్జాజర్
Also read:ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ బిల్లు: కౌంటర్ వ్యూహాంతో టీడీపీ
ఒకసారి శాసనసభ ఆమోదం పొందిన బిల్లును ఆర్డినెన్స్‌గా మార్చే అవకాశం లేదని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. శాసనమండలిలో ఏం జరుగుతోందో అనే విషయమై ఉత్కంఠ నెలకొంది.