శానస మండలి దెబ్బ: నిర్ణయం మార్చుకున్న వైఎస్ జగన్

By telugu teamFirst Published Jan 21, 2020, 3:42 PM IST
Highlights

గణతంత్ర వేడుకల విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.. గణతంత్ర వేడుకలను విశాఖపట్నంలో కాకుండా విజయవాడలోనే నిర్వహించాలని ఆయన తాజాగా అనుకుంటున్నారు.

అమరావతి: పాలనా వికేంద్రీకరణ బిల్లు లేదా మూడు రాజధానుల బిల్లులకు శాసన మండలిలో ఎదురు దెబ్బ తగలడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఎగ్జిక్యూటీవ్ రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రకటించిన జగన్ గణ తంత్ర దినోత్సవాల విషయంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. 

గణ తంత్ర దినోత్సవాలను ఈ నెల 26వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించాలని జగన్ అనుకున్నారు. కానీ, పాలనా వికేంద్రీకరణ బిల్లుకు శాసన మండలిలో చుక్కెదురు కావడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ వేడుకలను ఈసారి విజయవాడలోనే నిర్వహించనున్నారు. 

Also Read: జగన్ రాజధానిమార్పుపై పోరు: చంద్రబాబు వెనక్కి, పవన్ ముందుకు...

విజయవాడలో రిపబ్లిక్ డే వేడుకలకు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు విజయవాడ నగరవాసుసుల్లో అభద్రతా భావం పెరగకుండా ఉండేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. 

అమరావతి నుంచి రాజధానిని తరలించే వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణాయాన్ని 29 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోమవారం అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధిత రైతులను పరామర్శించేందుకు ప్రయత్నించారు. 

Also Read: కూల్చివేతలతో మొదలెట్టినోళ్లు.. కూల్చివేతలతోనే పోతారు: వైసీపీపై పవన్ వ్యాఖ్య

అయితే, ఆయనను పోలీసులు జనసేన పార్టీ కార్యాలయం నుంచి బయటకు రానీయలేదు. మంగళవారం ఉదయం అమరావతి రైతులో పవన్ కల్యాణ్ వద్దకు వచ్చారు.

click me!