జగన్ కేసు: పోలీసుల అదుపులో నిందితుడు శ్రీనివాస్ స్నేహితుడు, బంధువు

Published : Oct 26, 2018, 09:37 PM IST
జగన్ కేసు: పోలీసుల అదుపులో నిందితుడు శ్రీనివాస్ స్నేహితుడు, బంధువు

సారాంశం

వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి కేసు దర్యాప్తును విశాఖ పోలీసులు వేగం పెంచారు. ఇప్పటికే రోజున్నరపాటు నిందితుడు శ్రీనివాస్ ను విచారించి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు లేఖపై దృష్టి సారించారు.

విశాఖపట్నం: వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి కేసు దర్యాప్తును విశాఖ పోలీసులు వేగం పెంచారు. ఇప్పటికే రోజున్నరపాటు నిందితుడు శ్రీనివాస్ ను విచారించి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు లేఖపై దృష్టి సారించారు. 

శుక్రవారం ఉదయం నిందితుడు శ్రీనివాస్ ఇంటికి కేంద్రదర్యాప్తు బృందం, విశాఖ పోలీసులు బృందం వెళ్లింది. శ్రీనివాస్ వ్యక్తిగత జీవితం, స్నేహితులపై ఆరా తీసింది. అలాగే శ్రీనివాస్ ఎవరెవరితో ఉంటారు అన్న విషయంపై ఆరా తీసింది. అందులో భాగంగా చైతన్య అనే యువకుడిని విశాఖపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

చైతన్యది ముమ్మిడివరం మండలం ఠానేలంక గ్రామం. అలాగే శ్రీనివాస్ బంధువు వరుసకు సోదరి అయిన విజయదుర్గను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయదుర్గ నిందితుడు శ్రీనివాస్ జేబులో దొరికిన లేఖలో 9 పేజీలు ఆమె రాసినట్లు నిందితుడు విచారణలో తెలిపాడు. ఈ నేపథ్యంలో విజయదుర్గను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
విజయదుర్గ, చైతన్యలను పోలీసులు విచారణ నిమిత్తం విశాఖపట్నంకు తరలించారు. ఇప్పటికే ఒక పేజీ లేఖ రాసిన విశాఖ ఎయిర్ పోర్ట్ లోని రెస్టారెంట్ లో పనిచేసే అటెండర్ రేవతిపతిని పోలీసులు విచారిస్తున్నారు.  

 

ఈ వార్తలు కూడా చదవండి

బాబు ఫ్యాక్షనిస్టులా స్పందించారు: జగన్ మీద దాడిపై హర్షకుమార్

సీఎం, రాజప్ప రాజీనామా చెయ్యాలి, శివాజీని అరెస్ట్ చెయ్యాలి: మాణిక్యాల రావు డిమాండ్

ఎపి పోలీసులపై వ్యాఖ్య: జగన్ నష్టనివారణ చర్యలు

జగన్నాటకం రక్తికట్టలేదు, రాష్ట్రపతి పాలనకు కుట్ర:గంటా

నేను చెప్పాలనుకున్నదే లేఖలో రాశా...అది చూసుకోండి: నిందితుడు శ్రీనివాస్

కోర్టుకు శ్రీనివాస్, 9ఫోన్ లు ఒకే సిమ్, మరోకత్తి స్వాధీనం :జగన్ కేసుపై విశాఖ సీపీ లడ్డా

పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర:కన్నా సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

జగన్ "కేంద్రం"గా చంద్రబాబు రాజకీయం

ఆపరేషన్ గరుడ నమ్మాల్సి వస్తే శివాజీని ప్రశ్నించండి:టీడీపీకి రోజా కౌంటర్

జగన్ పై దాడి: లేఖ మడతలు పడలేదు, ఒక్కో పేజీలో ఒక్కో రాత

PREV
click me!

Recommended Stories

New Year Celebrations: కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన రామ్మోహన్ నాయుడు | Asianet News Telugu
వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నసూర్యకుమార్ యాదవ్ దంపతులు | Asianet News Telugu