ఎపి పోలీసులపై వ్యాఖ్య: జగన్ నష్టనివారణ చర్యలు

By pratap reddyFirst Published Oct 26, 2018, 8:22 PM IST
Highlights

ఎపి పోలీసులను వ్యతిరేకించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, తెలంగాణ పోలీసుల దర్యాప్తును కోరుకోలేదని ఆయన శుక్రవారం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిజీపిల డైరెక్షన్ లోనే దాడి జరిగిందని తాము అనుమానిస్తున్నామని వైసిపి మరో నేత అంబటి రాంబాబు అన్నారు. 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు అర్థమవుతోంది. ఎపి పోలీసులపై తనకు నమ్మకం లేదని, తెలంగాణ పోలీసులైతే తనకు ఫరవాలేదని జగన్ అన్నట్లు వచ్చిన వార్తలను వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు పార్థసారథి వివరణ ఇచ్చారు. 

తమ పార్టీ వైఖరిపై ఆయన స్పష్టత ఇచ్చారు. ఎపి పోలీసులను వ్యతిరేకించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, తెలంగాణ పోలీసుల దర్యాప్తును కోరుకోలేదని ఆయన శుక్రవారం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిజీపిల డైరెక్షన్ లోనే దాడి జరిగిందని తాము అనుమానిస్తున్నామని వైసిపి మరో నేత అంబటి రాంబాబు అన్నారు. 

జగన్ మీద జరిగిన దాడిపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్ లకు ఫిర్యాదు చేస్తామని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. స్వతంత్ర సంస్థతో తాము దర్యాప్తును కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. విచారణ సరిగా జరగాలంటే అదే సరైనదని ఆయన అన్నారు. 

ఆస్పత్రి నుంచి జగన్ డిశ్చార్జి అయిన తర్వాత వైసిపి  ముఖ్య నేతలు సమావేశమయ్యారు. జగన్ పై దాడి, ప్రభుత్వం తీరు, తదనంతర పరిణామాలపై ఆ సమావేశంలో చర్చించారు. 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన విమర్శల నేపథ్యంలో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో వైసిపి వైఖరిని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బిజెపి, పవన్ కల్యాణ్, జగన్, కేసిఆర్ కుమ్మక్కయి తమను టార్గెట్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. 

ఈ నేపథ్యంలో ఎపి పోలీసులపై నమ్మకం లేదని, తెలంగాణ పోలీసులైతే సరేనని జగన్ అన్నట్లు వచ్చిన వార్తలు నష్టాన్ని కలిగిస్తాయని భావించి వైసిపి నేతలు వివరణ ఇచ్చినట్లు కనిపిస్తోంది. 

జగన్నాటకం రక్తికట్టలేదు, రాష్ట్రపతి పాలనకు కుట్ర:గంటా

నేను చెప్పాలనుకున్నదే లేఖలో రాశా...అది చూసుకోండి: నిందితుడు శ్రీనివాస్

కోర్టుకు శ్రీనివాస్, 9ఫోన్ లు ఒకే సిమ్, మరోకత్తి స్వాధీనం :జగన్ కేసుపై విశాఖ సీపీ లడ్డా

పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర:కన్నా సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

జగన్ "కేంద్రం"గా చంద్రబాబు రాజకీయం

ఆపరేషన్ గరుడ నమ్మాల్సి వస్తే శివాజీని ప్రశ్నించండి:టీడీపీకి రోజా కౌంటర్

జగన్ పై దాడి: లేఖ మడతలు పడలేదు, ఒక్కో పేజీలో ఒక్కో రాత

సంబంధిత వార్తలు

click me!