ప్రియుడిపై మోజు.. భర్తకు ఫుల్ బాటిల్ ఇచ్చి, మెడకు చీరచుట్టి...కానీ... !

By AN TeluguFirst Published Sep 9, 2021, 9:24 AM IST
Highlights

భర్తకు తెలియకుండా అతడిని ఇంట్లో దాచి పెట్టింది. రాత్రి వేళ రోజూ మద్యం తాగి వచ్చే భర్తమీద వెంకటేశ్వరమ్మ రుసరుసలాడుతోంది. మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు ఎదురు వెళ్లి మరీ మద్యం ఫుల్ బాటిల్ ఇచ్చి తాగమని ఒత్తిడి చేసింది. భార్య ప్రవర్తన మీద అనుమానం వచ్చి తరువాత తాగుతానని చెప్పాడు. 

సింగరాయకొండ : ప్రియుడిపై మోజుతో భర్త మీద హత్యాయత్నానికి ప్రయత్నించి.. చివరకు ఆమె తన ప్రియుడితో కలిసి కటకటాల పాలైంది. ఈ సంఘటన మండలంలోని ఊళ్లపాలెం పంచాయతీ దేవలం పల్లెపాలంలో బుధవారం జరిగింది. ఫిర్యాదు అందిన 3.30 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ తెలిపారు. 

పోలీసుల కథనం ప్రకారం.. దేవలం పల్లె పాలేనికి చెందిన కొక్కిలిగడ్డ సుబ్బారావు తన భార్య వెంకటేశ్వరమ్మతో కలిసి బేల్దారి పనికోసం హైదరాబాద్ వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నాడు. వీరికి 13 యేళ్ల క్రితం వివాహమయ్యింది. ఇద్దరు కొడుకులున్నారు. గృహిణిగా ఇంటి వద్దే ఉంటున్న వెంకటేశ్వరమ్మకు కారు డ్రైవర్ గంటా సతీష్ తో పరిచయమయ్యింది. 

నిజామాబాద్ కు చెందిన సతీష్ హైదరాబాద్ లో కారు డ్రైవర్. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. రెండు నెలల క్రితం సుబ్బారావు తన భార్యతో కలిసి స్వగ్రామం వచ్చాడు. ప్రియుడిమీద ఉన్న మోజుతో అతడిని మంగళవారం తన ఇంటికి ప్రియుడిపై పిలిపించుకుంది.

భర్తకు తెలియకుండా అతడిని ఇంట్లో దాచి పెట్టింది. రాత్రి వేళ రోజూ మద్యం తాగి వచ్చే భర్తమీద వెంకటేశ్వరమ్మ రుసరుసలాడుతోంది. మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు ఎదురు వెళ్లి మరీ మద్యం ఫుల్ బాటిల్ ఇచ్చి తాగమని ఒత్తిడి చేసింది. భార్య ప్రవర్తన మీద అనుమానం వచ్చి తరువాత తాగుతానని చెప్పాడు. 

ఆ తరువాత ఆదమరిచి ఉన్న భర్త మెడకు చీరచుట్టి ఇద్దరూ ఉరేసే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన భర్త సుబ్బారావు బలవంతంగా తప్పించుకోవడంతో వీరి ప్రయత్నం విఫలమైంది. సముద్రం వద్ద ఉన్న బోట్లలో తలదాచుకుని అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్రమత్తమైన పోలీసులు ఎస్‌ఐ సంపత్‌కుమార్‌కు సమాచారం అందించారు. 

వెంకటేశ్వరమ్మను ఆయన అదుపులోకి తీసుకున్నారు. సాంకేతిక సహకారంతో ప్రియుడు సతీష్ ఫోన్ ను ట్రాప్ చేసి అతను కృష్ణా ఎక్స్ ప్రెస్ లో పారిపోతున్నాడని తెలుసుకున్నారు. చీరాల రైల్వే స్టేషన్ లో నిందితుడు సతీష్ ను కూడా అదుపులోకి తీసుకుని సింగరాయకొండకు తరలించారు. భార్య, ప్రియుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని, ఫిర్యాదు ఇచ్చిన 3.30 గంటల్లోనే కేసును చేధించామని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఎస్ ఐను సీఐ లక్ష్మణ్ ప్రత్యేకంగా అభినందించారు.

click me!