కైపెక్కించి మాటలతో న్యూడ్ వీడియోలు... తాడేపల్లి యువకుడికి కిలేడీ బ్లాక్ మెయిల్

By Arun Kumar PFirst Published Sep 19, 2022, 3:56 PM IST
Highlights

కైపెక్కించే మాటలతో యువకులను ముగ్గులోకి దించి...నగ్న వీడియోలను సేకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్న కిలేడీ వ్యవహారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో వెలుగుచూసింది. 

గుంటూరు : మాయమాటలతో అమాయక యువకులను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతోంది ఓ కిలాడీ మహిళ. తియ్యటి మాటలతో యువకులను ముగ్గులోకి దించి వారి నగ్న వీడియోలను సేకరిస్తుంది ఈ కిలేడీ. ఆ తరువాత తన అసలురంగు బయటపెట్టి బ్లాక్ మెయిల్ కు చేయడం ప్రారంభిస్తుంది. అందినకాడికి డబ్బులు దండుకుని మరో యువకుడి వేటలో పడుతుంది. ఇలా గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ యువకుడు ఈ కిలేడీ చేతిలో మోసపోయి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలోని ఓ అపార్ట్ మెంట్ లో బిబిఏ చదువుకునే యువకుడు(20) నివాసముంటున్నాడు. దగ్గర్లోని ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఈ యువకుడికి ఇటీవల గుర్తుతెలియని మహిళ నుండి ఫోన్ కాల్ వచ్చింది. పరిచయం లేకున్నా యువకుడితో మాటలు కలిపిన మహిళ మెల్లిగా లోబర్చుకుంది. ఇక ప్రతిరోజూ యువకుడితో మాట్లాడుతూ మాయమాటలతో పూర్తిగా వశపర్చుకుంది.  

యువకుడు పూర్తిగా తన మాయలో వున్నాడని నిర్దారించుకున్న మహిళ ప్లాన్ అమలు చేసింది. కైపెక్కించే మాటలతోనే యువకుడికి మత్తెక్కించి నగ్నంగా వీడియో కాల్ చేసేలా చేసింది. ఈ వీడియోను రికార్డ్ చేసి యువకున్ని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. 

Read More  దారుణం.. ఏపీలో ఇద్ద‌రు గిరిజ‌న మ‌హిళ‌ల‌ను అత్యాచారం చేసి హ‌త్య చేసిన దుండ‌గులు..

తాను అడిగినన్ని డబ్బులు పంపాలని... లేదంటే అతడి నగ్న వీడియోలను సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరించింది. దీంతో భయపడిపోయిన విద్యార్థి మొదట 8వేల రూపాయలు మహిళ చెప్పిన అకౌంట్ లో వేసాడు. అయినప్పటికి అతన్ని వదిలిపెట్టకుండా మరిన్ని డబ్బులు కావాలంటూ వేధించసాగింది. దీంతో బాధిత యువకుడు తాడేపల్లి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

బాధిత యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళ ఫోన్ నంబర్, డబ్బులు వేసిన అకౌంట్ నంబర్ తో పాటు ఇతర వివరాలను బాధిత యువకుడి నుండి సేకరించిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో కిలాడీ మహిళ ఆఛూకీని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా అపరిచితులను గుడ్డిగా నమ్మి మోసపోవద్దని తాడేపల్లి ప్రజలకు పోలీసులు సూచించారు. 
 

click me!