బాబు చాణుక్యుడు..సీబీఐకి ‘‘అనుమతి’’ రద్దుపై ఉండవల్లి వ్యాఖ్యలు

By sivanagaprasad kodatiFirst Published Nov 17, 2018, 11:48 AM IST
Highlights

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి రాష్ట్రంలో అనుమతిని ఉపసంహరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. సీబీఐ, ఈడీ, ఐటీ విచారణ సంస్థలంటే సీఎం ఎందుకు గజగజ వణికిపోతున్నారని ఉండవల్లి ప్రశ్నించారు.

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి రాష్ట్రంలో అనుమతిని ఉపసంహరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. సీబీఐ, ఈడీ, ఐటీ విచారణ సంస్థలంటే సీఎం ఎందుకు గజగజ వణికిపోతున్నారని ఉండవల్లి ప్రశ్నించారు.

రాష్ట్ర భూభాగ పరిధిలో సీబీఐ విచారణ చేసేందుకు అనుమతి లేదంటూ దేశంలోనే మొదటిసారిగా జీవో జారీ చేసిన సీఎం చంద్రబాబే అని ఎద్దేవా చేశారు. మా పై విచారణ జరపకూడదన్న విధంగా ముఖ్యమంత్రి జీవో జారీ చేశారని ఆయన తీరును తప్పుబట్టారు.

మా వూళ్లో అందరూ మంచోళ్లే.. పోలీసులు మా ఊరికి రావాల్సిన అవసరం లేదంటే ఎలా..? అంటూ ఉండవల్లి మండిపడ్డారు. వ్యాపారాలు చేసే టీడీపీ నాయకులు.. ప్రజాప్రతినిధులపై ఐటీ దాడులు జరిగితే తనపై దాడి చేసినట్లుగా సీఎం ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.

చంద్రబాబు తన వెనుకున్న కోటీశ్వరుల తరపునా..? లేకుంటే సామాన్య ప్రజల పక్షమా..? చెప్పాలన్నారు. మాకు కోర్టులు అవసరం లేదు.. మా ఎమ్మెల్యేలే కోర్టు, లోకేశ్ అప్పీల్ కోర్టు, చంద్రబాబు సుప్రీంకోర్టు అని జీవో జారీ చేయిస్తే సరిపోతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోడీ ప్రధాని అయ్యాక దేశం వెలిగిపోతోందని అసెంబ్లీలో చేసిన తీర్మానాలు ఇప్పుడేమయ్యాయని ఆయన ప్రశ్నించారు.

మీరు తప్పు చేయకుండా దర్యాప్తు సంస్థలను పంపితే మోడీ మిగులుతారా..? ప్రధాని ఏం చేయకుండానే ఎందుకు కంగారు పడుతున్నారని ఉండవల్లి దుయ్యబట్టారు. ఆయన అనుకుంటే తన పరిధిలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ అవినీతిపై విచారణకు ఆదేశించవచ్చని అరుణ్‌కుమార్ చెప్పారు. చంద్రబాబు పాలన సమర్థను పక్కనబెడితే... రాజకీయ సమర్థతపై ఎవరీకి ఎటువంటి అపనమ్మకం లేదన్నారు... దేశంలోని అన్ని పార్టీలతో కలిసినవారు చంద్రబాబు ఒక్కరేనని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు అండ్ కోపై సీబీఐ దాడులు, అందుకే సీబీఐకి నో ఎంట్రీ:ఉమ్మారెడ్డి

చంద్రబాబు మైండ్ బ్లాక్ , అందుకే పిచ్చి నిర్ణయాలు:వైవీ సుబ్బారెడ్డి

కేంద్రానికి చంద్రబాబు మెలిక....ఏపీలో సీబీఐకి ‘‘నో ఎంట్రీ‘‘

చంద్రబాబు తెలివైనవారు:మాజీ సీఎం కిరణ్ పొగడ్తలు

కులం చూసేకదా.. పవన్ కి బీజేపీ వత్తాసు పలికింది.. బొత్స

జగన్ తో నడవని వైఎస్ ఆత్మ ఏమంటోంది....

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అధికారిక చిహ్నం.. రాష్ట్ర విభజనతో మార్పులు

సొంత జిల్లాలో చంద్రబాబుకి షాక్

సీఎంకు సిగ్గులేదు, ప్రతిపక్షనేతకు దమ్ములేదు:పవన్ కళ్యాణ్

click me!