ఆస్తి కోసం.. భార్య మర్మావయవాన్ని కోసిన భర్త

sivanagaprasad kodati |  
Published : Nov 17, 2018, 10:11 AM IST
ఆస్తి కోసం.. భార్య మర్మావయవాన్ని కోసిన భర్త

సారాంశం

ఆస్తి, అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను దారుణంగా హింసించిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన కోటిపల్లి దేవీరమణకుమార్‌కు కొన్నేళ్ల క్రితం ఓ యువతితో విహిహమైంది. 

అయితే బాధితురాలిని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దచేసిన ఆమె మేనత్త కొద్దిరోజుల క్రితం చనిపోయింది. ఆమె ఆస్తిపై కన్నేసిన రమణకుమార్.. కొన్నాళ్లుగా భార్యను ఆస్తి రాయించుకుని రావాల్సిందిగా వేధిస్తున్నాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో భార్య తన మాట వినడం లేదన్న కోపంతో ఆమెను గదిలో బంధించి మర్మావయాన్ని కోసి చిత్రహింసలకు గురిచేశాడు. కన్నబిడ్డను సైతం చంపుతానని బెదిరించడంతో ఆమె భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గృహహింస చట్టం కింద రమణకుమార్‌ను అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

CM Nara Chandrababu Naidu Speech: మెప్మా, డ్వాక్రా సంఘాలకు చంద్రబాబు గుడ్ న్యూస్ | Asianet Telugu
Pemmasani Chandrasekhar Spech: 25 సంవత్సరాల ముందు చంద్రబాబు విజన్ ఈ సంఘాలు| Asianet News Telugu