టాప్ స్టోరీస్ : ఫైనల్స్ లోకి భారత్.. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..వాయుగుండం తీవ్ర రూపం...

By SumaBala Bukka  |  First Published Nov 16, 2023, 7:27 AM IST

భారత్ ప్రపంచ కప్ ఫైనల్స్ కి చేరుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను గర్వించేలా చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా షమీ, కోహ్లీ మంత్రమే జపిస్తున్నారు. ఇలాంటి నేటి టాప్ స్టోరీస్ ఇవి.. 


1. 
వరల్డ్ కప్ ఫైనల్ లోకి టీమిండియా గ్రాండ్ ఎంట్రీ.. 

భారత్ అదరగొట్టింది.. కోహ్లీ సెంచరీల్లో అర్థ సెంచరీ చేసి ఇరగదీశాడు. ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా షమీ రికార్డుల మోత మోగించాడు. మొత్తానికి ప్రపంచకప్ లో నాలుగోసారి  భారత్ ఫైనల్స్ కి చేరుకుంది. అన్ని పత్రికలూ.. వీటినే ప్రముఖంగా బ్యానర్ ఐటమ్స్ గా ప్రచురించాయి. కోహ్లీ, షమీ రికార్డుల మోత మీద ప్రత్యేక కథనాలతో ఫ్రంట్ పేజీని నింపేశాయి.

Latest Videos

Mohammed Shami : షమీ వికెట్ల సునామీ... ఒక్క మ్యాచ్ లోనే ఇన్ని రికార్డులేంటి భయ్యా...

Virat Kohli: మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్కర్ రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లీ

2. 
బంగాళాఖాతంలో వాయుగుండం.. నేడు తీవ్రవాయుగుండంగా మార్పు...

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేటి ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఆగ్నేయ, దానికి అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో  ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం ఉదయానికి బలపడి వాయుగుండంగా మారింది.  అది 12 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఆంధ్రప్రదేశ్ తీరం దిశగా వచ్చింది. గురువారం ఉదయానికి తీవ్రవాయుగుండంగా మారనుందని.. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో వ్యాప్తంగా అనేక జిల్లాల్లో  ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు...

3. 
మురుగునీటికి పోలీసు కాపలా...!!

ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో రెండు వర్గాల మధ్య గొడవతో పోలీసులు మురుగునీటికి కాపలా ఉండాల్సిన దుస్థితిని ఆంధ్రజ్యోతి ఓ చిన్న  వార్తగా ప్రచురించింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో వైసీపీకి చెందిన ఓ సర్పంచ్ కు మరో వర్గానికి మధ్య విభేదాలు ఉండడంతో మురుగునీరు వెళ్లే మార్గాన్ని ఓ వర్గం మూసేసింది. దీంతో మురుగునీరు రోడ్డుపై  నిలిచిపోయింది.  ఆ నీటిలో నుండే ఎస్సీ కాలనీవాసులు రాకపోకలు సాగించాల్సి రావడం, దుర్వాసనలతో ఇబ్బందులు పడుతున్నామంటూ ఎన్నిసార్లు కలెక్టర్లకు, అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.  దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.  ఉధృత పరిస్థితులు ఏర్పడకుండా పోలీసులు మురుగునీరు సరిగా పారేలా చూడడానికి బందోబస్తు  ఏర్పాటు చేశారు.

4.
చంద్రబాబుకు గుండె సమస్య!

చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ అనే వార్తను కూడా అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఈనాడు దీని మీద ప్రత్యేక కథనం ప్రచురిస్తూ గుండె సమస్యతో బాధపడుతున్నారని చెప్పుకొచ్చింది.  దీనికి సంబంధించిన వైద్య నివేదికలను న్యాయవాదులు హైకోర్టులో దాఖలు చేశారని రాసింది. ఇప్పటివరకు చంద్రబాబు  కన్నుకు  శస్త్ర చికిత్స జరిగిందని, అనారోగ్య సమస్య నుంచి కోలుకునేందుకు డాక్టర్లు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలని అందులో తెలిపారు. కంటి పరీక్ష కోసం ఐదు వారాల షెడ్యూల్ ఉందని, ఐదు వారాలు ఇంట్రా అక్యులర్ ప్రొజెక్టర్ ప్రేక్షిస్తుండాలని డాక్టర్లు చెప్పినట్టుగా  ఆ నివేదికలో పేర్కొన్నారు.  దీంతోపాటు చంద్రబాబుకు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని, గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలలో సమస్యలు ఉన్నాయని దీనికోసం తగినంత విశ్రాంతి అవసరమని డాక్టర్ల నివేదికలో తెలిపారు.

చంద్రబాబు గుండె సైజు పెరిగింది: ఏపీ హైకోర్టుకు హెల్త్ రిపోర్టు అందజేత

5.
బీజేపీకి విజయశాంతి రాజీనామా.. కాంగ్రెస్ లో చేరిక !

బిజెపి నేత విజయశాంతి ఆ పార్టీకి రాజీనామా చేసింది. కాంగ్రెస్  సీనియర్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో  కాంగ్రెస్లో చేరింది. ఈ మేరకు రాజీనామా లేఖను బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు.  కొంతకాలంగా విజయశాంతి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు.   తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కిషన్ రెడ్డికి ఇచ్చినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు.  ఆమెను బుజ్జగించే నేపథ్యంలో పోరాటాల కమిటీ చైర్పర్సన్ గా బాధ్యతలు ఇచ్చిన పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు.  ఇప్పుడు కాంగ్రెస్ చేరనున్నట్లుగా  ఈనాడు కథనాన్ని ప్రచురించింది.

ఈ లింక్ లో పూర్తి కథనం

6.
వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి శంఖుస్థాపన.. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి బుధవారం నాడు శంకుస్థాపన చేశారు. దీనిమీద ప్రతిపక్షాలు ఎన్నికల స్టంట్ అంటూ విరుచుకుపడుతున్నాయి.  నాలుగు నెలల్లో ఎన్నికలు కూడా ఉండగా ఇప్పుడు ఎత్తిపోతల పథకాలు శంకుస్థాపనలు గుర్తుకు వచ్చాయా అంటూ ఎద్దేవా చేస్తున్నాయి.  దీనికి సంబంధించిన వార్తలను ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించాయి. 

పూర్తి కథనం

7.
కాంగ్రెస్ ది మీ వేలుతో మీ కళ్ళు పొడిచే కుట్ర.. కేసీఆర్

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరు పెంచాయి. కెసిఆర్  మెరుపు వేగంతో అనేక జిల్లాల్లో సభలు నిర్వహిస్తున్నారు.  అన్నిచోట్ల కాంగ్రెస్ మీ వేలుతో మీ కళ్ళు పొడిచే కుట్ర చేస్తోందంటూ..  ప్రధాన ప్రతిపక్షంపై విరుచుకుపడుతున్నారు. మరోవైపు  టిపిసిసి చైర్మన్ రేవంత్ రెడ్డి కూడా అలుపెరుగకుండా  ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.  తమ ప్రధాన టార్గెట్గా  కేసీఆర్,  కేటీఆర్ లని ఉద్దేశించి వాగ్భానాలు విసురుతున్నారు. . కెసిఆర్ పదేళ్ల పాలనలను వందేళ్ళ నష్టం చవిచూసిందని  చెబుతున్నారు. టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవని.. ఆలోచించి ఓటు వేయాలని ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. ఈ వార్తలను కూడా అన్ని పత్రికలు  ప్రచురించాయి.

కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

8.
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..

తెలంగాణలో  నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ  గడువు ముగిసింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తంగా 2,297 మంది అభ్యర్థులు బరిలో దిగనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన బుధవారం నాడు 61 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోనే అత్యధికంగా నామినేషన్లు దాఖలు అయ్యాయి.  నామినేషన్ల ఉపసంహరణ కూడా ఇక్కడే ఎక్కువగా నమోదయింది. 7 ఇక్కడ 70 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ 44 మంది పోటీలో  ఉన్నారు.  మరోవైపు కామారెడ్డి లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే ఇక్కడ కూడా తుది బోరుకు వచ్చేసరికి 39 మంది అభ్యర్థులు ఉన్నారు. దీనికి సంబంధించిన వివరణాత్మక కథనాన్ని ఈనాడు ప్రచురించింది.

పూర్తి కథనం..

9.
పెళ్లిళ్లకు.. ఎన్నికల కోడ్ కష్టాలు...

తెలంగాణలో ఎన్నికల  సీజన్,  పెళ్లిళ్ల సీజన్ ఒకేసారి రావడంతో   పెళ్లి చేసుకునే జంటలు, వారి కుటుంబాలు  కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.  పెళ్లి సామాగ్రి,  నగదు తరలించే విషయంలో.. ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో  ఇబ్బందులు పడుతున్నారు.  బంగారం బట్టలు ఇతర లాల్చనాలకు భారీగా నగదు అవసరమవుతుండడం… 50వేలకు మించి డబ్బులను వెంట తీసుకువెళ్లే అవకాశం లేకపోవడంతో  ఇక్కట్ల పాలవుతున్నారు.  దీంతో తనిఖీ కేంద్రాల దగ్గర పక్క ఆధారాలు సమర్పించితేనే  తమకున్న,  తమ సొమ్ము తమకు దక్కుతుంది.  లేదంటే.. ఎన్నికల కోడ్ నియమావళి ప్రకారం సీజ్ చేసే అవకాశం ఉందంటూ.. ఈనాడు ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

10.
జమ్మూకశ్మీర్ లో ఘోర ప్రమాదం, 38మంది మృతి

జమ్మూ కాశ్మీర్లో బుధవారం  విషాద ఘటన చోటుచేసుకుంది.  ఓ బస్సు లోయలో పడి 38 మంది మృత్యువాత పడ్డారు.  మరో 20 మంది ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. జమ్ము కాశ్మీర్లోని దోడా జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. మృదుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. 

దోడాలో లోయలో పడిన బస్సు..
 

click me!