ఆఫీస్ బాయ్ నుండి అంతర్జాతీయ స్మగ్లర్ గా...ఏపీ డ్రగ్ డాన్ అతడేనా?: ఎంపీ కనకమేడల సంచలనం

By Arun Kumar PFirst Published Sep 29, 2021, 4:45 PM IST
Highlights

డ్రగ్స్  గుజరాత్ నుంచి కాకినాడకు, అక్కడి నుంచి విజయవాడకు, ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రవాణా అవుతోందని సమాచారం వుందని... ఇందులో నిజమెంతో తేల్చాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు.

అమరావతి: గుజరాత్ ముంధ్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్ స్మగ్లింగ్ కు కాకినాడకు లింకులున్నాయన్న వార్తలొస్తున్నాయని టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. సుధాకర్ చేత అలీషా అనే వ్యక్తి  ఆషి ట్రేడింగ్ కంపెనీ ఏర్పాటు చేయించినట్టు... వీరికి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో సంబందాలున్నాయన్న ప్రచారం జరుగుతోందంటూ కనకమేడల తెలిపారు. 

హెరాయిన్ స్మగ్లింగ్ పై డీ.ఆర్.ఐ విచారణ పూర్తి కాకుండానే దీంతో ఏపీకి సంబందం లేదని పోలీసులు చెప్పటం సమంజసమా? పోలీసులు ముందే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? అని ప్రశ్నించారు. విచారణ పూర్తి కాకుండా క్లీన్ చీట్ ఇవ్వటం నిందితుల్ని ప్రోత్సహించటమే... ఇది వారి సర్వీస్ రూల్స్ కు విరుద్దం అని కనమేడల అన్నారు.  

''పోలీసులు రాజకీయ నాయకుల్లా ప్రెస్ మీట్స్ పెట్టి ప్రతిపక్ష నేతల్ని విమర్శించటం ఏంటి? కొంతమంది వైసీపీ నేతలు పోలీసుల్ని బూతులు తిట్టారు, మరికొందరు బెదిరించారు వాటిపై ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు ఎందుకు ఖండించలేదు?'' అని అడిగారు. 

''చంద్రబాబుతో చర్చిండానికి 20 కార్లలో ‎కర్రలు, రాళ్లతో చంద్రబాబు ఇంటికెళ్లడానికి జోగి రమేష్ కి పోలీసులు అనుమతిచ్చారా? పోలీసులు ప్రభుత్వంలో భాగస్వాములు తప్ప, అధికార పార్టీలో భాగస్వాములు కాదని గ్రహించి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి... లేకపోతే కోర్టులో ముద్దాయిలుగా నిలబడక తప్పదు. హెరాయిన్ ఘటనపై పూర్తి విచారణ చేసి దానితో వైసీపీ నేతలకు సంబందం ఏంటో...ఏపీలో ఉన్న ఢ్రగ్ డాన్ ఎవరో తేల్చాలి'' అని కనకమేడల డిమాండ్ చేశారు. 

READ MORE  పోసాని ఓ పెయిడ్ అర్టిస్ట్... ఆయనతో మాట్లాడిస్తున్నది ఈ బృందమే: అచ్చెన్న

''డ్రగ్స్  గుజరాత్ నుంచి కాకినాడకు, అక్కడి నుంచి విజయవాడకు, ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రవాణా అవుతోందని సమాచారం. ఈ వాస్తవాలు కేంద్ర ప్రభుత్వ అధికారుల విచారణలో బయటపడ్డాయని సమాచారం. గుజరాత్ లో పట్టుబడిన హెరాయిన్ విజయవాడ చిరునామాతో ఉండటంపై డీజీపీ, విజయవాడ సీపీల వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. గుజరాత్ పోర్ట్ లో పట్టుబడిన హెరాయిన్ పై డీఆర్ఐ విచారిస్తుండగానే ముందుగానే ఏపీ పోలీస్ వారు ఎందుకు భుజాలు తడుముకున్నారు?'' అని టిడిపి ఎంపీ ప్రశ్నించారు. 

''డ్రగ్స్, గంజాయి జాడ్యం రాష్ట్రాన్ని పట్టిపీడిస్తోంది. మత్తు పదార్థాల వ్యవహారంపై ఏపీ పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో విచారించాకే మాట్లాడిందా..? పోలీస్ అధికారులై ఉండి డ్రగ్స్ వ్యవహారంపై రాజకీయ నాయకులు మాట్లాడవద్దని... సున్నితమైన అంశమని ఎలా చెబుతారు? వైసీపీ పోలీస్ అధికారులైతే అలా మాట్లాడినా తమకు అభ్యంతరం లేదు... కానీ ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారులు, పోలీస్ శాఖ హెడ్ సమాచారం లేకుండా, విచారణ పూర్తికాకుండానే పరస్పర విరుద్ధమైన ప్రకటనలు మధ్యలో చేయవచ్చా?'' అని నిలదీశారు. 

''డ్రగ్స్ వ్యవహారంలో ప్రధాన వ్యక్తయిన షేక్ మహ్మద్ అలీషా అంటే తూర్పుగోదావరి జిల్లాలో తెలియనివారు లేరు. ఆ వ్యక్తికి కాకినాడలోని అధికారపార్టీ వారికి ఉన్న లింకేమిటో పోలీసులు తేల్చారా? విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీ యజమాని సుధాకర్ కు, అలీషాకు ఉన్న లింకేమిటో డీజీపీకి తెలుసా? కాకినాడ పోర్టులోని మెరైన్ ఆఫీసులో ఒక ఆఫీస్ బాయ్ గా జీవితం ప్రారంభించిన అలీషా, నేడు అంతర్జాతీయస్థాయిలో మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నాడని సమాచారం. శాన్ మెరైన్ కంపెనీ, అట్లాస్ మైనింగ్ కంపెనీ, అట్లాస్ ఆఫ్ షోర్ , బ్రైట్ ఆఫ్ షోర్ కంపెనీలపేర్లతో కార్యకలాపాలు సాగిస్తున్నాడని, , వాటిలో అధికారపార్టీ నేతల భాగస్వామ్యం కూడా ఉందంటున్నారు. వీటన్నింటిపై డీఆర్ఐ విచారిస్తుండగానే విజయవాడ పోలీస్ కమిషనర్, డీజీపీ ఎలా మాట్లాడారు?'' అని అడిగారు.

''డ్రగ్స్ వ్యవహారంపై రాజకీయపార్టీలు మాట్లాడటం మంచిదికాదని, చాలా సున్నితమైన అంశమని, భద్రతకు సంబంధించిన అంశమని డీజీపీ ఎలా చెబుతారు? ఈ మొత్తం వ్యవహారంలోని వాస్తవమెంతో డీజీపీకి తెలుసునా? లక్నో-ఆగ్రా ఎక్స్ ప్రెస్ లో 972కిలోల గంజాయిని డీఆర్ఐ విభాగం పట్టుకుందని... దాని విలువ రూ.1.45కోట్లు ఉంటుందనే వార్త బయటకు వచ్చింది. దానిపై డీజీపీకున్న సమాచారం ఏమిటి? డ్రగ్స్ దందా, దాని వెనకున్న వ్యక్తులు, వారికి సహకరిస్తున్నవారెవరో తెలియకుండా డీజీపీ మాట్లాడటం నేరస్తులను తానే ప్రోత్సహిస్తున్నట్లుగా ఉన్నాయి'' అన్నారు. 

'' ప్రభుత్వ బాధ్యతల్లో కొనసాగుతూ పక్షపాతంతో పోలీస్ శాఖ వ్యవహరించడం రాష్ట్ర శాంతిభద్రతలకు ఎంతమాత్రం మంచిదికాదు. ప్రతిపక్ష నేతలను తప్పుపడుతున్న డీజీపీ, పోలీసులను దూషించిన, అధికారపార్టీ నేతలను ఏనాడు ఎందుకు తప్పుపట్టలేదు?'' అని ఎంపీ కనకమేడల నిలదీశారు. 

click me!