Asianet News TeluguAsianet News Telugu

పోసాని ఓ పెయిడ్ అర్టిస్ట్... ఆయనతో మాట్లాడిస్తున్నది ఈ బృందమే: అచ్చెన్న

సినీనటుడు పోసాని ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అని... ఆయనతో పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడించి రాక్షసానందం పొందుతున్న టీం వేరే వుందని టిడిపి ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

Posani krishnamurali is a Paid Artist...tdp ap chief atchannaidu
Author
Amaravati, First Published Sep 29, 2021, 4:17 PM IST

అమరావతి: సభ్యసమాజం తలదించుకునేలా సినీ హీరో, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తల్లి, భార్య, కుటుంబసభ్యుల గురించి సినీనటుడు పోసాని కృష్ణమురళి చేత ప్రశాంత్ కిషోర్ టీం అత్యంత నీచంగా మాట్లాడిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇలాంటివి వద్దని గౌరవప్రదమైన ముఖ్యమంత్రి స్థానంలో వున్న జగన్ రెడ్డి ఎందుకు బహిరంగంగా వారించలేదు? అని అచ్చెన్న నిలదీశారు. 

''రాజకీయ విమర్శలకు రాజకీయంగా జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని నడిపే పార్టీ నేతలపై ఉంటుంది. రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పకుండా దాటవేసి బూతులు, తిట్లతో మహిళాలోకాన్ని బజారుకీడ్చడాన్ని ఏమంటారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. సామాన్యులు వినలేని.. మాట్లాడలేని భాషలో వైసీపీ నేతలు మాట్లాడుతుంటే తాడేపల్లిలో జగన్ రెడ్డి ఆనందంలో మునిగితేలుతున్నారు. మద్యం షాపుల దగ్గర చీప్ లిక్కర్ తాగిన తాగుబోతులు కూడా ఈ విధంగా మాట్లాడరేమో?'' అంటూ మండిపడ్డారు.

''రూ.2 లక్షల కోట్ల డ్రగ్స్ మాఫియాకు ఆంధ్ర రాష్ట్రం అడ్డాగా మారింది. డ్రగ్ మాఫియాతో వైసిపి నేతలు చేతులు కలిపి వేల కోట్ల రూపాయలు దోపిడి చేస్తూ యువతను నిర్వీర్యం చేస్తున్నారు. ఈ డ్రగ్స్ మాఫియాలో ఆఫ్ఘన్ టెర్రరిస్టులు కూడా కుమ్మక్కై దేశ ద్రోహానికి పాల్పడుతున్నారు'' అని ఆందోళన వ్యక్తం చేశారు.

Video  పోసాని వ్యాఖ్యలు మిస్ ఫైర్... జగన్ పై పోరుకి పవన్ ఆయుధం సిద్ధం..!

''ఈ ప్రభుత్వ పెద్దలు విద్యుత్ చార్జీలు, పెట్రోల్, డీజీల్ ధరలు, ఇసుక రేట్లు, మద్యం రెట్లు, ఆస్తి పన్ను, నిత్యావసరల ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై వేల కోట్ల భారాన్ని మోపుతున్నారు. ఈ అసమర్ధ పాలనలో రాష్ట్రంలో దళిత, గిరిజన, మైనార్టీ, బడుగు వ్యవస్థలోని మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి'' అన్నారు. 

''హెరాయిన్ తో పాటు, గంజాయి, గుట్కా, తలనీలాలు, ఎర్రచందనం, బియ్యం, శాండ్, ల్యాండ్, వైన్, మైన్ మాఫియాలతో దోపిడికి ఆగడాలు నిత్యం పతాక శీర్షికల్లో కనిపిస్తున్నాయి. ఈ ప్రజా వ్యతిరేక విధానాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో వైసిపి నేతలు కుల, మత, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారు. బూతులు, జుబుత్సాకరమైన భాషను ప్రయోగించి సంస్కృతి సాంప్రదాయాలను మంటగల్పుతున్నారు'' అని ఆరోపించారు. 

''స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను, ప్రజా ప్రయోజనాలను బలిపెట్టకూడదు. రాజకీయ విమర్శలకు బూతులు కాకుండా ప్రజాస్వామ్య స్పూర్తిని కొనసాగించేలా మాట్లాడకపోతే సరైన సమయంలో ప్రజలు మీకు గుణపాఠం చెబుతారని మర్చిపోకండి. కొందరిని కొంత కాలమే మోసం చేయగలరు... ఎల్లకాలం మోసం చేయలేరన్న లోకోక్తిని గుర్తు తెచ్చుకోవాలి. వైసిపి నేతల వికృత బూతులను ఖండించాల్సిందిగా ప్రజలు, మేదావులు, ప్రజాస్వామ్యవాదులను విజ్ఞప్తి చేస్తున్నాం'' అన్నారు అచ్చెన్నాయుడు. 

Follow Us:
Download App:
  • android
  • ios