లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఫైర్: జగన్ కోసం బాబుకు వ్యతిరేకంగా...

Published : Oct 21, 2018, 11:12 AM IST
లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఫైర్: జగన్ కోసం బాబుకు వ్యతిరేకంగా...

సారాంశం

 ముఖ్యమంత్రి చంద్రబాబును అప్రతిష్ట పాలు చేయడానికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కోసం ఆర్జీవీ ఆ సినిమాను నిర్మిస్తున్నారని తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, తుడా చైర్మన్ జి. నరసింహ యాదవ్ ధ్వజమెత్తారు.

తిరుపతి: రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై తెలుగుదేశం పార్టీ నాయకులు కత్తులు నూరుతున్నారు. ఈ సినిమా వల్ల తెలుగుదేశం పార్టీ చిక్కుల్లో పడినట్లే కనిపిస్తోంది. అందుకే విమర్శలను ఎక్కుపెడుతున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును అప్రతిష్ట పాలు చేయడానికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కోసం ఆర్జీవీ ఆ సినిమాను నిర్మిస్తున్నారని తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, తుడా చైర్మన్ జి. నరసింహ యాదవ్ ధ్వజమెత్తారు.

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రోద్బలంతోనే ఆర్జీవీ ఆ సినిమా తీస్తున్నారని ఆయన శనివారం మీడియా సమావేశంలో విమర్శించారు. ఆర్జీవిని ఆయన పోర్న్ డైరెక్టర్ గా అభివర్ణించారు. ఆర్జీవి అటువంటి సినిమాలు తీయడానికే ఆర్హుడని, వాటినే తీసుకుంటూ ఉండాలని ఆయన సలహా ఇచ్చారు. 

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చేయడానికి ముందు చంద్రబాబుతో చర్చించి ఆయన అనుమతి తీసుకోవాలని యాదవ్ ఆర్జీవికి సూచించారు. సినిమాలో ఎన్టీఆర్ ను అప్రతిష్టపాలు చేయడానికి సినిమా తీస్తున్నందున ఆర్జీవిని తెలుగు సినీ పరిశ్రమ బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, లక్ష్మీపార్వతి ఆ సినిమాను తీయడానికి పూనుకున్నట్లు మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఆ సినిమా వారి మైండ్ సెట్ ను ప్రతిబింబిస్తుందని అన్నారు. ఆ సినిమాను తీస్తే తీవ్ర పరిణామాలుంటాయని తెలుగుదేశం పార్టీ దివంగత నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడి కుమారుడు భాను ప్రకాశ్ హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన


ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!

PREV
click me!

Recommended Stories

He is true Hero! మైనారిటీల కోసం అలుపెరగని పోరాటం | Dr Masthan Basha about Abdul Azeez | Asianet News
Pawan Kalyan Pressmeet: ఢిల్లీలో ‘జాతీయ సమైక్యత కోసం.. సేన ప్రస్థానం | Asianet News Telugu