పోలీసుల బాధ్యత మాది, ప్రజల బాధ్యత మీది:చంద్రబాబు

By Nagaraju TFirst Published Oct 21, 2018, 11:11 AM IST
Highlights

పోలీసు కుటుంబాల సంక్షేమం బాధ్యత తనదేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆదివారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు పోలీసులకు తమ కుటుంబాల కంటే ప్రజాసేవ అంటేనే ఎంతో ఇష్టమని అభిప్రాయపడ్డారు. పోలీసుల సంక్షేమానికి రూ.15కోట్లు కేటాయించినట్లు చంద్రబాబు స్పష్టంచేశారు. 
 
పోలీస్ విభాగంలో ప్రతీ ఒక్కరికీ ప్రమోషన్ వచ్చేలా పాలసీ ఏర్పాటు చేస్తామని, ప్రతీ పోలీస్ స్టేషన్ కు ఆధునిక వాహనం అందుబాటులో ఉంచుతామన్నారు. అలాగే రాజధాని పరిధిలో 2500 మంది పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం జరుపుతామని అమరావతిలో పోలీసు అమరవీరుల స్థూపం నిర్మాణం జరుపుతామని చంద్రబాబు అన్నారు. అలాగే హోంగార్డులకు జీతం పెంచామని పోలీసు కుటుంబాలకు గృహవసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

మరోవైపు రౌడీలు ఏపీ బయటే ఉండాలని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వబోమని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసుల సేవలను చంద్రబాబు కొనియాడారు. ఎర్రచందనం సంపదను ప్రాణాలు అడ్డు వేసి పోలీసులు కాపాడారని, అలాగే విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ విధానం అవలంభించాలన్నారు. 

రాజకీయం ముసుగులో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఘటనలను అడ్డుకోవడంపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుని ఘటన, విశాఖ ఎయిర్‌పోర్టు ఘటనలు అలాంటివేనని చంద్రబాబు గుర్తు చేశారు. పోలీసులు తమ జీవితాన్ని దేశం కోసం ప్రజల కోసం అంకితం చేయడం గొప్పసేవానిరతి అన్నారు.  

ప్రజల భద్రతే మా ధ్యేయం ఫ్రెండ్లీ పోలీసింగే మా లక్ష్యం అని సీఎం చంద్రబాబు అన్నారు. దేశ వ్యాప్తంగా 414 మంది, రాష్ట్రవ్యాప్తంగా 6గురు పోలీసులు విధినిర్వహణలో మరణించారని, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చంద్రబాబు అన్నారు.
 
click me!