పోలీసులనే బూతులు తిట్టిన టిడిపి నేత

First Published Nov 14, 2017, 5:02 PM IST
Highlights
  • రాష్ట్రంలో టిడిపి నేతల దౌర్జానాలకు, ఇష్టారాజ్యానికి ఇదొక తాజా ఉదాహరణ మాత్రమే.

అసలే తెలుగుదేశంపార్టీ నేత. పైగా మధ్యం సేవించున్నాడు. అందులోనూ పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చారు. ఇక చెప్పేదేముంది? స్టేషన్లోనే పోలీసులపై బూతుల దండకం అందుకున్నాడు. అరెస్టు చేద్దామంటే టిడిపి నేతైపోయాడు. అందులోనూ తాగేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. దాంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. రాష్ట్రంలో టిడిపి నేతల దౌర్జానాలకు, ఇష్టారాజ్యానికి ఇదొక తాజా ఉదాహరణ మాత్రమే.

ఇంతకీ జరిగిందేంటంటే, గుంటూరులోని రాజేంద్రనగర్ కు చెందిన రామాంజనేయస్వామి అనే చోటా నేత ఫుల్లుగా మద్యం తాగి కారు నడిపుతూ ఓ మహిళను ఢీ కొట్టారు. దాంతో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేసారు. సరే, మహిళను పక్కనే ఉన్న ఆసుపత్రిలో చేర్చారులేండి. వైద్యులు పరీక్షించిన తర్వాత మహిళ కాలు విరిగిందని తేల్చారు. ఇంతలో పోలీసులు వచ్చి జరిగింది తెలుసుకుని సదరు నేతను పోలీసు స్టేషన్ కు తరలించారు.

ఇక, అక్కడి నుండి పోలీసులకు తలనొప్పులు మొలయ్యాయి. పోలీసులు చెప్పేది వినడు. తాను చెప్పదలచుకున్నది సవ్యంగా చెప్పడు. ఎందుకంటే మద్యం కిక్కు ఫుల్లుగా ఎక్కేసింది. ఎంతసేపు ఒకటే గొడవ. తాను టిడిపి నేతనని, తనను స్టేషన్ కు తీసుకొచ్చిన వాళ్ళ అంతు చూస్తానని. సిఐ బదిలీలనే చేయించే స్ధాయి నేతను ఓ పెట్టీ కేసులో పోలీసు స్టేషన్ కు తీసుకొస్తారా అంటూ ఒకటే బూతులు.  ఈ నేత బూతులను భరించలేక పట్టాభిపురం స్టేషన్ పోలీసులు ట్రాఫిక్ పోలీసులను పిలిపించి వారికి అప్పజెప్పి తలనొప్పులు వదిలించుకున్నారు.

click me!